Share News

Not Backing Down Either! బుజ్జగింపులకు లొంగట్లే ... వెనక్కి తగ్గట్లే

ABN , Publish Date - Oct 29 , 2026 | 12:17 AM

Not Giving In to Persuasion… Not Backing Down Either! జిల్లా ప్రాదేశిక పోరులో రెబల్స్‌ వెనక్కి తగ్గడం లేదు. జిల్లాలోని పలు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో వారు బరిలో ఉన్నారు. పోటీకి సై అంటున్నారు. దీంతో కూటమి పార్టీ అభ్యర్థులకు రెబల్స్‌ బెడద తప్పడం లేదు. జిల్లాలో ఒక్కచోట కూడా ఏకగ్రీవం కాలేదంటే ఇక్కడి పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. కూటమి అధికారంలోకి ఉండడంతో ఆయా పార్టీలకు చెందిన మద్దతుదారులు స్థానికంగా ప్రజాప్రతినిధి కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

 Not Backing Down Either! బుజ్జగింపులకు లొంగట్లే ... వెనక్కి తగ్గట్లే

  • బలం లేకున్నా.. పోటీకి సై

  • జడ్పీటీసీ, ఎంపీటీసీ కూటమి అభ్యర్థులకు తప్పని బెడద

  • పలు ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ, జనసేన అభ్యర్థులకు బీఫారాలు

  • సీతంపేట, వీరఘట్టంలో అత్యధికంగా జనసేన ఎంపీటీసీ అభ్యర్థులు పోటీ

పార్వతీపురం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రాదేశిక పోరులో రెబల్స్‌ వెనక్కి తగ్గడం లేదు. జిల్లాలోని పలు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో వారు బరిలో ఉన్నారు. పోటీకి సై అంటున్నారు. దీంతో కూటమి పార్టీ అభ్యర్థులకు రెబల్స్‌ బెడద తప్పడం లేదు. జిల్లాలో ఒక్కచోట కూడా ఏకగ్రీవం కాలేదంటే ఇక్కడి పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. కూటమి అధికారంలోకి ఉండడంతో ఆయా పార్టీలకు చెందిన మద్దతుదారులు స్థానికంగా ప్రజాప్రతినిధి కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో అధిష్ఠానాల ఆదేశాలను పట్టించుకోవడం లేదు. నేతల బుజ్జగింపులకు లొంగడం లేదు. బీఫారాలు లేకపోయినా స్వతంత్య్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. కొన్ని స్థానాల్లో కూటమికి చెందిన పార్టీల నేతలు కూడా రెబల్స్‌ను తెరవెనుక ప్రోత్సహిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఇదీ పరిస్థితి..

- జిల్లాలో 15 జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారిలో టీడీపీ 9, బీజేపీ ఒకటి , జనసేన నుంచి ఐదు, వైసీపీ నుంచి 15 నామినేషన్లు ఉన్నాయి. స్వతంత్య్ర అభ్యర్థులతో పాటు పాటు ఇతర పార్టీలకు చెందిన వారు 22 మంది పోటీలో ఉన్నారు. కాగా బలిజిపేట, గుమ్మలక్ష్మీపురం, వీరఘట్టం స్థానాలను జనసేనకు కేటాయించారు. అయితే ఈ మూడుచోట్ల రెబల్స్‌ ఉన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థులతో పాటు టీడీపీ మద్దతుదారులు స్వతంత్య్ర అభ్యర్థులుగా పోటీపడుతున్నారు. బలిజిపేట జడ్పీటీసీ అభ్యర్థిగా టీడీపీ నుంచి దుర్గేశ్వరి ప్రాదేశిక పోరులో ఉన్నారు. గుమ్మలక్ష్మీపురంలో టీడీపీ నేత పాడి సుదర్శనరావుకు టికెట్‌ రాకపోవడంతో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీరఘట్టం మండలంలో టీడీపీ నుంచి జనసేనకు వెళ్లిన వ్యక్తితో పాటు అదే పార్టీకి చెందిన నాయకుడు, బీజేపీకి చెందిన మరో నాయకుడు రెబల్స్‌గా కొనసాగుతున్నారు.

- జిల్లాలోని 226 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 534 మంది బరిలో ఉన్నారు. అయితే సుమారు 22 స్థానాల్లో రెబల్స్‌ బరిలో ఉన్నారు. బలం లేని చోట కూడా పోటీకి దిగుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీకు సంబంధించి ఒకే సెగ్మెంట్‌ నుంచి బీ ఫారాలతో పోటీ చేస్తున్నవారే కాకుండా కూటమి పార్టీల మద్దతుదారులు పోరులో ఉన్నారు. సీతంపేటలో 13, వీరఘట్టంలోని 14 సెగ్మెంట్లలో అత్యధికంగా జనసేన ఎంపీటీసీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

టీడీపీ, జనసేన అభ్యర్థులకు బీ ఫారాలు

సీతానగరం మండలంలోని తామరఖండి, వెంకటాపురం, నిడగల్లు ఎంపీటీసీ సెగ్మెంట్లలో టీడీపీ, జనసేన పార్టీ అభ్యర్థులకు కూడా బీఫారాలు ఇచ్చారు. గరుగుబిల్లి మండలం రావుపల్లి, తోటపల్లి సెగ్మెంట్లలో , కొమరాడ మండలం కంపవలస, పాలెం, కెమిశీల ఎంపీటీసీ స్థానాలకు, జియ్యమ్మవలస మండలం అర్నాడ, చింతల బెలగాం, పెదమేరంగి సెగ్మెంట్లలో, పాచిపెంట మండలంలోని మూడు ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ, జనసేన పార్టీలు బీఫారాలు అందించాయి. స్నేహపూర్వక పోటీ అంటూ అభ్యరులు రంగంలోకి దిగుతుండగా.. ఇది రెబల్స్‌, ప్రత్యర్థి పార్టీలకు కలిసొస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Updated Date - Oct 29 , 2026 | 12:17 AM