Share News

not accepted jagan decession అప్పుడలా.. ఇప్పు‘డీలా’

ABN , Publish Date - Jul 05 , 2026 | 12:04 AM

not accepted jagan decession వైసీపీ అధినేత జగన్‌ రాజధానిగా మావిగన్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికలు అమరావతి వర్సెస్‌ మావిగన్‌ అజెండాగా జరుగుతాయని.. మావిగన్‌ రాజధానిగా నచ్చిన వారు వైసీపీకి ఓటు వేస్తారని స్పష్టం చేశారు.

not accepted jagan decession అప్పుడలా.. ఇప్పు‘డీలా’

అప్పుడలా.. ఇప్పు‘డీలా’

మావిగన్‌ నినాదంపై వైసీపీ నేతల అంతర్మథనం

జగన్‌ స్టాండ్‌ మార్చడంతో గుబులు

విశాఖ రాజధాని నుంచీ యూటర్న్‌

గతంలో సంచలన ప్రకటనలు చేసిన బొత్స

అమరావతిపై అంతులేని విద్వేషం

విజయనగరం, జూలై 4(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత జగన్‌ రాజధానిగా మావిగన్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికలు అమరావతి వర్సెస్‌ మావిగన్‌ అజెండాగా జరుగుతాయని.. మావిగన్‌ రాజధానిగా నచ్చిన వారు వైసీపీకి ఓటు వేస్తారని స్పష్టం చేశారు. అయితే ఈ నిర్ణయంపై జిల్లాలో వ్యతిరేక స్పందన వస్తోంది. మెజార్టీ వైసీపీ శ్రేణులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అంతర్గత చర్చల్లో మన పని అయిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘అమరావతికి జైకొట్టారు. అప్పట్లో సరే అన్నారు. తరువాత మూడు రాజధానులు అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో బాగా ప్రచారం చేసుకోండి అని చెప్పారు. ఇప్పుడు మావిగన్‌ అంటున్నారు. ఇలా అయితే ప్రజలు నమ్మరు. కచ్చితంగా ఛీ కొడతారు’ అంటూ వైసీపీ సీనియర్‌ నేత ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ‘అమరావతిని వ్యతిరేకించాం. విశాఖ రాజధాని అని ఊరూవాడ ప్రచారం చేశాం. పాలనా రాజధానిగా చేయలేకపోయాం. కనీసం ఇప్పుడు రాజధాని విషయంలో మౌనంగా ఉంటే సరిపోయేది. ప్రజల్లో పలుచన కావడం ఖాయం’ అంటూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్‌ మావిగన్‌ అని ఖరారు చేసిన వెంటనే ఇదే స్టాండ్‌ తీసుకోవాలని వైసీపీ అనుబంధ విభాగాల ప్రతినిధులకు మౌఖికంగా ఆదేశాలు వచ్చాయి. కానీ ప్రజలు నమ్మరని వైసీపీ శ్రేణులు అంతర్గతంగా మాట్లాడుకోవడం జిల్లాలో కనిపిస్తోంది. ‘ఇప్పుడు అమరావతిని అభివృద్ధి చేస్తున్నారు. కష్టమో నష్టమో. దానికే కట్టుబడి ఉండడమా లేదా మౌనంగా ఉండడమో చేస్తే సరిపోతుంది కదా’ అని ఓ సీనియర్‌ వైసీపీ నాయకుడు అభిప్రాయపడుతున్నారు.

అభివృద్ధితో కూటమి..

కూటమి వచ్చిన తరువాత జిల్లాలో అభివృద్ధి కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో సింహాభాగం ప్రయోజనాలు జిల్లాకు దక్కుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్స వానికి సిద్ధమైంది. ఐటీ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రిలయన్స్‌ డేటా సెంటర్‌ నిర్మాణానికి ముందుకు వచ్చింది. ఐటీ పరిశ్రమలు జిల్లాకు వస్తున్నాయి. విశాఖ-రాయ్‌పూర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణం..ఇలా ఎన్నెన్నో ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నాయి. జిల్లా ప్రజల్లో సంతృప్తి కనిపిస్తోంది. ఈ తరుణంలో జగన్‌ మావిగన్‌ ప్రతిపాదన వైసీపీ శ్రేణులను తీవ్ర నైరాశ్యంలో నెట్టింది. విశాఖ పాలనా రాజధానితో జిల్లా ముఖచిత్రమే మారిపోతుందని వైసీపీ ముఖ్య నాయకుడు బొత్స సత్యనారాయణ నుంచి ఆ పార్టీ నేతలు గతంలో ప్రకటనలు చేశారు. బొత్స అక్కడితో ఆగకుండా అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఉన్నఫలంగా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ విశాఖ పాలనా రాజధాని నుంచి యూటర్న్‌ తీసుకున్నారు. ఇన్నాళ్లు జిల్లా ప్రజలకు ఎన్నెన్నో మాటలు చెప్పామని..వారి వద్ద చులకన కావడం ఖాయమని క్షేత్రస్థాయిలో వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. తమ పరిస్థితి ఏంటని అయోమయంలో పడుతున్నాయి.

-----------------

Updated Date - Jul 05 , 2026 | 12:04 AM