Share News

Not a Father, But a Monster తండ్రి కాదు మృగాడు

ABN , Publish Date - Jul 15 , 2026 | 11:47 PM

Not a Father, But a Monster బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే మృగాడుగా మారాడు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. కన్న కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడి గర్భిణిని చేశాడు. భామిని మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గిరిజన గ్రామంలో చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Not a Father, But a Monster  తండ్రి కాదు మృగాడు

  • గర్భం దాల్చిన గిరిజన బాలిక

భామిని, జూలై15(ఆంధ్రజ్యోతి): బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే మృగాడుగా మారాడు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. కన్న కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడి గర్భిణిని చేశాడు. భామిని మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గిరిజన గ్రామంలో చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బత్తిలి ఎస్‌ఐ కె.రవీంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ గిరిజన దంపతులకు ముగ్గురు పిల్లలు. వారిలో మొదటి కుమార్తె (16) చదువుకోకుండా ఇంటి వద్దే ఉంటోంది. పొలంతో పాటు ఇంటి పనులు చేస్తూ తల్లిదండ్రులకు చేదోదువాదోడుగా ఉంటోంది. అయితే కొంతకాలంగా తండ్రి ఆ కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు. కాగా ఇటీవల కాలంలో బాలిక తీవ్ర అనారోగ్యానికి గురైంది. బుధవారం ఆశా వర్కర్‌ సాయంతో బాలికను సీతంపేట ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి ఎనిమిది నెలల గర్భిణిగా నిర్ధారించారు. అయితే దీనికి తండ్రే కారణమని బాలిక చెప్పడంతో వైద్య సిబ్బంది పోలీసులకు సమచారం అందించారు. వెంటనే బత్తిలి పోలీసులు ఆ గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాలిక తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ దర్యాప్తు అనంతరం నిందితునిపై పోక్సో కేసు నమోదు చేయనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Jul 15 , 2026 | 11:47 PM