రెండోరోజు జోరుగా నామినేషన్లు
ABN , Publish Date - Oct 22 , 2026 | 11:46 PM
జిల్లాలో 226 ఎంపీటీసీ, 15 జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ జోరుగా జరుగుతుంది.
- ఎంపీటీసీ స్థానాలకు 516, జడ్పీటీసీ స్థానాలకు 38 దాఖలు
- నేటితో ముగియనున్న ప్రక్రియ
పార్వతీపురం, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 226 ఎంపీటీసీ, 15 జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ జోరుగా జరుగుతుంది. రెండో రోజు గురువారం పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఎంపీటీసీ స్థానాలకు 516, జడ్పీటీసీ స్థానాలకు 38 (టీడీపీ 12, వైసీపీ 18, జనసేన 3, కాంగ్రెస్ 1, కమ్యునిస్ట్ పార్టీ 2, ఇండిపెండింట్ 2) నామినేషన్లు వచ్చాయి. జడ్పీటీసీకి సంబంధించి జిల్లా పరిషత్ సీఈవో సుధాకరరావు ఆధ్వర్యంలో అధికారులు నామినేషన్లు స్వీక రించారు. అదే విధంగా 15 మండలాలకు చెందిన ఎంపీ టీసీల అభ్యర్థులు కూడా నామినేషన్లు వేశారు. మండల ఎన్నికల ప్రత్యేకాధికారులతో పాటు ఆయా మండలాలకు చెందిన ఎంపీడీవోలు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీక రించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఇప్పటి వరకు జడ్పీటీసీ స్థానాలకు 43, ఎంపీటీసీ స్థానాలకు 618 నామినేషన్లు దాఖాలయ్యాయి. నామినేషన్ల స్వీకరణ శుక్రవారం ముగియనుంది. దీంతో చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.
ప్రశాంతంగా సాగాలి
పార్వతీపురం రూరల్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి గురువారం పరిశీలించారు. అభ్యర్థుల సందేహాల నివృత్తికి హెల్ప్ డెస్క్‌లను అందుబాటులో ఉంచాలని, నామినేషన్ల ప్ర క్రియకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అధికారులకు సూచించా రు. అనంతరం స్ర్టాంగ్ రూమ్‌లు, రిసెప్షన్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సుల భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు.
నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి: కలెక్టర్
ప్రిసైడింగ్ అధికారులు, అసి స్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం పార్వతీపురం లయన్స్ క్లబ్ కల్యాణ మండపంలో మున్సిపల్ సాధారణ ఎన్నికలు-2026 కోసం ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల విధులను ఎటువంటి పొరపాట్లు లేకుండా, పూర్తి పారదర్శకతతో నిర్వహించాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. ఓటర్లు ఎటువంటి ఒత్తిళ్లకు, ప్రలోభా లకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పీళ్లు, ఉపసంహరణ వంటి కీలక దశలను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలన్నారు. ప్రిసైడింగ్ అధికారి మాత్రమే ఫోన్ కలిగి ఉండాలని, ఏపీవోలు లేదా ఇతర సిబ్బంది ఎవరూ ఫోన్లు దగ్గర ఉంచుకోవడానికి వీల్లేదని ఆదేశించారు. పోలింగ్ సమయంలో నకిలీ ఓట్లు రాకుండా ఉండేందుకు ఓటరు గుర్తింపు కా ర్డును పరిశీలించి, వారి వేలికి సరైన మార్కింగ్ వేసి ఆరిన తర్వాతే ఓటు వేసేందుకు అనుమతించాల న్నారు. పోలీసులు, రెవెన్యూ సి బ్బంది సహాయంతో పోలింగ్ ప్రక్రి య సజావుగా జరిగేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్వ తీపురం మున్సిపల్ కమిషనర్ బి.రాంగోపాల్, ప్రిసైడింగ్ అధికా రులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికా రులు తదితరలు పాల్గొన్నారు.