Pension! ఏ దిక్కూ లేదు.. పింఛన్ పునరుద్ధరించండి!
ABN , Publish Date - Jun 23 , 2026 | 12:03 AM
No Support from Any Side... Restore My Pension! ‘నాకు ఏ దిక్కూ లేదు. గతంలో ఇచ్చిన సామాజిక పింఛన్ నిలిపేశారు. నా పింఛన్ పునరుద్ధరించండి.’ అని పాలకొండ నగర పంచాయతీ 17వ వార్డుకు చెందిన మజ్జి గౌరమ్మ అనే వృద్ధురాలు కన్నీటిపర్యంతమైంది. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ హేమలతను కలిసి వినతిపత్రం అందించింది.
ఇన్‌చార్జి జేసీకి వినతిపత్రం అందజేత
పార్వతీపురం, జూన్ 22(ఆంధ్రజ్యోతి): ‘నాకు ఏ దిక్కూ లేదు. గతంలో ఇచ్చిన సామాజిక పింఛన్ నిలిపేశారు. నా పింఛన్ పునరుద్ధరించండి.’ అని పాలకొండ నగర పంచాయతీ 17వ వార్డుకు చెందిన మజ్జి గౌరమ్మ అనే వృద్ధురాలు కన్నీటిపర్యంతమైంది. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ హేమలతను కలిసి వినతిపత్రం అందించింది. అన్నదాత సుఖీభవ మంజూరు చేయాలని సీతానగరం మండలం నిడగళ్లుకు చెందిన కె.లక్ష్మణరావు, పార్వతీపురం మండలం జమదాలకు చెందిన పి.శ్రీరామ్మూర్తి కోరారు. జీతం ఇప్పించాలని పాల కొండ మండలం తుమరాడకి చెందిన పారిశుధ్య కార్మికుడు బి.దాస్ అర్జీ అందించాడు. మరికొందరు రెవెన్యూ సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చారు. అర్జీలను పరిశీలించి.. త్వరితగతిన పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఇన్‌చార్జి జేసీ హేమలత ఆదేశించారు. ప్రజా వినతులను తమ సమస్యలుగా భావించాలన్నారు. అర్జీల్లో కొన్నింటిని పరిష్కరించలేకపోతే అందుకు గల కారణాలను అర్జీదారులకు వివరించి లిఖితపూర్వకంగా వారి దగ్గర నుంచి సంతృప్తి సమాధానాన్ని సేకరించాలని ఆదేశించారు. సచివాలయాల స్థాయిలో కన్వర్జెన్సీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఆర్డీవో మాధురి, ఎస్‌డీవో ధర్మరాజు, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, అగ్నిమాపకాఖ తదితరులు పాల్గొన్నారు.