Share News

పర్యవేక్షణ లేక.. వసూలు కాక

ABN , Publish Date - Feb 16 , 2026 | 12:28 AM

గజపతినగరం, పురిటిపెంట పంచాయ తీల్లో ఆశీలు బకాయిలు పేరుకుపోతున్నాయి. పంచాయతీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వసూళ్లు కావడంలేదన్న విమర్శలొస్తున్నాయి. పాలకులు, అధికారులు మారినా బకాయిలపై దృష్టి సారించ డంలేదు. ఏటా పాట నిర్వహిస్తున్నా పాత బకాయిలు చెల్లించాలని పాటదారులపై ఒత్తిడి తీసుకురావడంలేదు.

పర్యవేక్షణ లేక.. వసూలు కాక
గజపతినగరంలో కూరగాయల మార్కెట్‌

గజపతినగరం, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): గజపతినగరం, పురిటిపెంట పంచాయ తీల్లో ఆశీలు బకాయిలు పేరుకుపోతున్నాయి. పంచాయతీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వసూళ్లు కావడంలేదన్న విమర్శలొస్తున్నాయి. పాలకులు, అధికారులు మారినా బకాయిలపై దృష్టి సారించ డంలేదు. ఏటా పాట నిర్వహిస్తున్నా పాత బకాయిలు చెల్లించాలని పాటదారులపై ఒత్తిడి తీసుకురావడంలేదు.

సిండికేట్‌కావడంతో..

గజపతినగరం, పురిటిపెంట పంచాయతీలకు మండలంలోని పలుగ్రామాల్లో పండిం చిన కూరగాయల పంటలను ఇక్కడకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. దీంతో ప్రస్తుతం గజపతినగరం పంచాయతీకి సంబందించి ప్రతి రోజూ మూడు నుంచి నాలు గువేల వరకు ఆదాయం వస్తుంది. పురిటిపెంట పంచాయితీకి నాలుగువేల నుంచి ఐదు వేల వరకు ఆశీలరూపంలో ఆదాయంవస్తుంది. ఈ రెండు పంచాయతీల్లో ఏటా మార్చిలో జరిగే ఆశీలు వేలం పాటకు సంబందించి పంచాయతీ పాలకులు, అధికారు లు,పాటదారులు సిండికేట్‌కావడంతో పాటను తగ్గిస్తువస్తున్నారన్న ఆరోపణలు విని పిస్తున్నాయి. కరోనా సమయంలో నాలుగులక్షలకు వెళ్లిన ఆశీలపాట గత ఏడాది రెండు లక్షలకు తగ్గిపోయింది. పాటదారులు బకాయిలను పూర్తిస్థాయిలో చెల్లించడం లేదు. లక్షల్లో ఆశీలు పాటపాడిన పాటదారులు వేల రూపాయల్లో పంచాయతీలకు చెల్లించి చేతులు దులుపుకొంటున్నారు. ఏటా పాటదారులు మారుతుండడంతో అధికారులు పేరుకుపోయిన బకాయిలను రికార్డులకే పరిమితం చేస్తున్నారు. వారికి నోటీసులిచ్చి బకాయిలు రాబట్టే ప్రయత్నాలు మాత్రం చేయడంలేదు. ఇప్పటివరకు గజపతినగరం పంచాయతీకి ఐదు లక్షలకు పైబడి, పురిటిపెంట పంచాయతీకి సంబందించి 13 లక్షలకు పైబడి బకాయిలు పేరుకుపోయాయి.

పాట తగ్గినా అధిక వసూలు

గజపతినగరం పంచాయతీలో చంపావతి వంతెన నుంచి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వరకు జాతీయరహదారికి ఇరువైపులా ఉన్న షాపుల నుంచి, కూరగాయలు, చేపల మార్కెట్‌, వాహనాల లోడింగ్‌,అన్‌లోడింగ్‌ ఇసుక బళ్లు, ట్రాక్టర్లు తదితర వాటిపై ఆశీలు వసూ ళ్లుచేస్తున్నారు. అయితే ఆశీలువసూళ్లు చేసిన వారికి ఎటువంటి రశీదు ఇవ్వడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. ఏటా పంచాయతీపాట తగ్గినా వసూళ్లు మాత్రం ఏడాదికేడాది పెంచుకుంటు పోతున్నారని, నిర్ణీత ధర ప్రకటించకుండా ఇష్టారాజ్యంగా వసూళ్లు పాల్పడుతున్నారని వ్యాపారులు, కూరగాయ రైతులు వాపోతున్నారు. వ్యాపారాలను బట్టి, వాహనాల లోడింగ్‌ అన్‌ లోడింగ్‌కు సంబందించి ధరల పట్టికను పంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటుచేయాలి. కాని ఆ విదంగా చేయడంలేదని ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలు తీసుకువస్తే తట్టకు రూ.10 వసూళ్లు చేయడం శోచనీయమని రైతులు వాపోతున్నారు. పాటదారులు సిండికేట్‌ కావడంతో పంచా యతీ ఆదాయానికి గండిపడుతోందని పలువురు చెబుతున్నరు.

మార్చి నెలాఖరులోగా చెల్లించకపోతే చర్యలు

పాత బకాయిలు చెల్లించాలని పాటదారులకు ఏటా నోటీసులు అందిస్తున్నామని గజపతినగరం ఇన్‌చార్జీ ఈవో జగదీష్‌తెలిపారు. అయినా కొంతమంది పట్టించుకోవ డంలేదని చెప్పారు. మార్చి నెలాఖరులోగా బకాయిలు చెల్లించని పక్షంలో చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Feb 16 , 2026 | 12:28 AM