Share News

కబుర్లు వద్దు

ABN , Publish Date - Oct 10 , 2026 | 12:05 AM

‘కళ్లబొల్లి కబుర్లు వద్దు. నేను ఎక్కువ మాట్లాడితే ఏడుస్తావ్‌.

 కబుర్లు వద్దు
మాట్లాడుతున్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

-ఎక్కువ మాట్లాడితే ఏడుస్తావ్‌

- మీ ఇంటి ముందు రోడ్డు నేనే వేశాను

- మంత్రి సంధ్యారాణి

-మాజీ ఎమ్మెల్యేని ఉద్దేశించి వ్యాఖ్యలు

సాలూరు, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ‘కళ్లబొల్లి కబుర్లు వద్దు. నేను ఎక్కువ మాట్లాడితే ఏడుస్తావ్‌. నాకు కాంగ్రెస్‌ పార్టీ ఒక పదవి ఇస్తే.. వద్దని చెప్పి గవర్నర్‌కు నా రాజీనామా పత్రం సమర్పించి తెలుగు దేశం పార్టీలో చేరాను. అంతేగానీ నీలాగ పదవి కోసం కాంగ్రెస్‌ నుంచి వైసీపీలోకి పోలేదు.’ అంటూ ఓ మాజీ ఎమ్మెల్యేని ఉద్దేశించి రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మండలంలోని కొత్తవలసలో సుమారు రూ.30 లక్షలతో నిర్మించిన విలేజ్‌ హెల్త్‌ సెంటర్‌, కరాసువలస కేజీబీవీ ప్రాంగణంలో రూ.2.12 కోట్లతో నిర్మించిన అదనపు భవన సముదాయాన్ని, డార్మెటరీని శుక్రవారం ఆమె ప్రారంభించారు. అనంతరం మామిడిపల్లిలో మీ భూమి-మీహక్కు కార్యక్రమంలో భాగంగా 1656 మందికి పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ఆమె ఓ మాజీ ఎమ్మెల్యేని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘18 సంవత్సరాలు పదవిలో ఉన్న మీకంటే నేనెక్కువ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నా. కాంగ్రెస్‌ పార్టీలో ఉండి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మెంబరు పదవిని వదులుకొని టీడీపీలో చేరాను. రాజశేఖర్‌రెడ్డి భక్తుడిని అని చెప్పుకొనే మీరు మాత్రం కేవలం పదవి కోసమే కాంగ్రెస్‌ను వీడి వైసీపీలోకి వెళ్లిపోలేదా? శిలాఫలకాలు వేస్తే సరిపోదు. తల తాకట్టు పెట్ట యినా నిధులు తెచ్చి అభివృద్ధి చేయడమే నాయకు రాలుగా నా లక్ష్యం. లేనిపోని కబుర్లు మాట్లాడవద్దు. నేను ఎక్కువ మాట్లాడితే ఏడుస్తావ్‌. నీ ఇంటి ముందు రోడ్డు నేనే వేశాను. కూటమి ప్రభుత్వం రాకముందు ఆ వీధిలో చిన్నపాటి వర్షం వస్తే ముడుకుడు నీరు ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. మీలాగ ప్రజలు పనిచేయమని వస్తే కారెక్కిపోవడం, ఇంటికి తాళాలు వేయడం, ముఖం చాటుపెట్టడం, లేరు అని సిబ్బందితో చెప్పించడం, మరీ జనం ఎక్కువ అయితే కుక్కలను విడిచిపెట్టడం నాకు రాదు. నాతో పనిచేయించుకోవడం ప్రజల హక్కు. ప్రజా సేవకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటా. మామిడిపల్లిలో రూ.4 కోట్లతో హాస్టల్‌ను నిర్మిస్తున్నాం. త్వరలో ఆసు పత్రి భవనాన్ని కూడా ప్రాంభిస్తాం. దివంగత టీడీపీ నాయకుడు డొంక శ్రీను పేరుమీద కమ్యూనిటీ హాల్‌ను నిర్మిస్తాం. జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా నీరందిస్తాం. ఈ 28 నెలల్లో నియోజకవర్గంలో రూ.10 కోట్లు ఖర్చుచేసి 541 గోకు లాలు నిర్మించాం. రానున్న స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయా లి.’ అని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఆముదాల పరమేశు, నాయకులు డొంకా అన్నపూర్ణ, బూస తవుడు, అప్పికొండ యుగంధర్‌, కోట్ల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2026 | 12:05 AM