ఇసుక క్వారీలు వద్దు
ABN , Publish Date - Jun 02 , 2026 | 11:44 PM
మండలంలోని పెద్దపుర్లి గ్రామంలో గల నాగావళి నదీ తీరంలో అక్ర మ ఇసుక క్వారీలు వద్దని పెద్దపుర్లి, చిన్నపుర్లి గ్రామ స్థులు డిమాండ్ చేశారు.
పెద్దపుర్లి గ్రామస్థుల ధర్న
రేగిడి, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెద్దపుర్లి గ్రామంలో గల నాగావళి నదీ తీరంలో అక్ర మ ఇసుక క్వారీలు వద్దని పెద్దపుర్లి, చిన్నపుర్లి గ్రామ స్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నాగవళి నదీ తీరంలో మంగళవారం నిరసన చేపట్టారు. 2006లో అప్పటి ప్రభుత్వం నదికి రక్షణగా కరకట్టు వేస్తే, ఇప్పు డు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు అధికార పార్టీ నేతల అండతో ఇక్కడ ర్యాంప్‌లు నిర్వహించడం అన్యాయ మని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. గత రెండు రోజులుగా ప్రైవేటు వ్యక్తులు కరకట్టను తవ్వి ర్యాంప్‌న కు ఏర్పాట్లు చేయటం, ఎక్సక వేటర్‌తో పనులకు దిగడం గ్రహించిన గ్రామస్థులు.. స్థానిక మాజీ ఎంపీటీసీ పాలవలస సూర్యరావు, స్థానిక నీటి సంఘం ఆధ్వర్యం లో పనులను అడ్డుకుని.. నిరసన తెలిపా రు. ఎక్సకవేటర్ నిర్వాహకులతో వాదనకు దిగారు. ఇక్కడ కరకట్ట తొలగించి క్వారీలు చేస్తే పెద్దపుర్లి గ్రామంతో పాటు వందలాది ఎకరాల పంట పొలాలకు ముప్పు తప్పదని భయాందోళన వ్య క్తం చేశారు. అవసరమైతే అక్రమ క్వారీల వ్యవ హారం కలెక్టర్‌కు, మైన్స్ అధికారులకు తెలియజేస్తామని గ్రా మస్థులు చెప్పారు. అనంతరం ఎక్సకవేటర్ నిర్వాహకు లు అక్కడ నుంచి జారుకున్నారు.