Share News

No room should be left for errors. పొరపాట్లకు తావివ్వకూడదు

ABN , Publish Date - Jul 23 , 2026 | 12:27 AM

No room should be left for errors. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి ఆదేశించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు పరిపాలనా భవనంలో బుధవారం అధికారులతో సమీక్షించారు.

No room should be left for errors. పొరపాట్లకు తావివ్వకూడదు
పీఎం పర్యటన ఏర్పాట్లలో భాగంగా సూచనలు ఇస్తున్న కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి.

పొరపాట్లకు తావివ్వకూడదు

ప్రధాని పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు

కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

భోగాపురం, జూలై 22(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి ఆదేశించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు పరిపాలనా భవనంలో బుధవారం అధికారులతో సమీక్షించారు. భోగాపురం (అల్లూరి సీతారామరాజు) అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి వచ్చేనెల 1న వస్తున్న ప్రధాని పర్యటన రాష్ట్రానికి, ఉత్తరాంధ్ర అభివృద్ధికి చారిత్రాత్మక ఘట్టమని చెప్పారు. ఏశాఖకు అప్పగించిన బాధ్యతలను ఆ శాఖలు అలసత్వం వహించకుండా విజయవంతం చేయాలని సూచించారు. ప్రైవేట్‌ లేఅవుట్‌లో పార్కింగ్‌కు సంబంధించి ఆర్‌అండ్‌బీ, జిఎంఆర్‌ ప్రతినిధులతో మాట్లాడి పార్కింగ్‌ సామర్థ్యం, వాహన రాకపోకలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, ట్రాఫిక్‌ నిర్వహణ, మౌలిక సదుపాయాలపై సూచనలు ఇచ్చారు. వీవీఐపీ, వీఐపీ వాహనాలకు ప్రత్యేక పార్కింగ్‌ కేటాయించాలని సూచించారు. సుమారు రెండు లక్షల మంది హాజరవుతున్నారని, అందరూ పరస్పర సమన్వయంతో పనిచేయాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే విద్యార్థులకు వసతి, భోజనం, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పించాలని, భద్రత కోసం మహిళా పోలీసులు, వైద్య సేవల కోసం వైద్య బృందాలు, అంబులెన్సులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రధాని సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించేలా ఓపెన్‌ టాప్‌ జీపు సిద్ధం చేయాలని, ప్రధాన వేదిక, వీవీఐపీ గ్యాలరీ, మీడియా గ్యాలరీ, పీఎంవో, సీఎంవో, జీఎంఆర్‌ ప్రతినిధుల కోసం ప్రత్యేక గదుల ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అన్ని కీలక ప్రాంతాల్లో అగ్నిమాపక పరికరాలు, అగ్నిమాపక సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. సభా ప్రాంగణ ఏర్పాట్లను పరిశీలించారు. సమావేశంలో జేసీ సేతుమాధవన్‌, అదనపు ఎస్పీ సౌమ్యలత, ఆర్డీవో సుధాసాగర్‌, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసపాణి, తహసీల్దార్‌ జి.హేమంత్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

ప్రధాని సభకు 2వేల ఆర్టీసీ బస్సులు

వచ్చేనెల 1న భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని నరేంద్రమోదీ సభకు హాజరయ్యే ప్రజలకు రవాణా సౌకర్యం కోసం 2వేల ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఈడీ గీత తెలిపారు. బుధవారం భోగాపురం ఎయిర్‌పోర్టు సభాస్థలాన్ని ఆమె సందర్శించారు. పార్కింగ్‌ ప్రదేశాలను పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలకు రవానా పరంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

పీఎం పర్యటన ఏర్పాట్లపై ఆరా

మండలం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంతంలో ముమ్మరంగా జరుగుతున్న ప్రదాని మంత్రి నరేద్ర మోదీ పర్యటన ఏర్పాట్లును జిల్లా కలెక్టర్‌ ఎస్‌ రామసుందర్‌ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈసందర్భంగా ప్రధాని పాల్గొనే బహిరంగా సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం వేదిక ఏర్పాట్లు, గ్యాలరీలు, మీడియా సెంటర్‌, గ్రీన్‌ రూమ్స్‌, తదితర వాటిపై సంబందిత అధికారులతో చర్చించి పలు సూచనలు ఇచ్చారు.

కేంద్ర పౌర విమానయానశాఖ కార్యదర్శి పర్యటన

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని నరేంద్రమోదీ పర్యటన ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని కేంద్ర పౌర విమానయానశాఖ కార్యదర్శి సమీర్‌ కుమార్‌ సిన్హా సూచించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ప్రధాని పర్యటించే ప్రాంతంతో పాటు టెర్మినల్‌ భవనం, రన్‌వే, బహిరంగ సభాప్రాంగణం, ఎయిర్‌పోర్టు ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎయిర్‌ పోర్టు ప్రారంభోత్సవం, మోదీ పర్యటన ఏర్పాట్ల ప్రగతిపై కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి వివరించారు.

Updated Date - Jul 23 , 2026 | 12:27 AM