Share News

Achieving Targets లక్ష్య సాధనలో నిర్లక్ష్యం వద్దు

ABN , Publish Date - Jul 01 , 2026 | 11:51 PM

No Room for Negligence in Achieving Targets ప్రభుత్వ లక్ష్యాల సాధనలో నిర్లక్ష్యం వహించరాదని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో వైశాలి అన్నారు. క్షేత్రస్థాయిలో అర్హులైన వారందరికీ సకాలంలో సంక్షేమ పథకాలు అందించాలని ఆదేశించారు. బుధవారం పెదపెంకిలో ఆమె విస్తృతంగా పర్యటించారు. గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

  Achieving Targets   లక్ష్య సాధనలో నిర్లక్ష్యం వద్దు
పెదపెంకిలో పనులను పరిశీలిస్తున్న ఇన్‌చార్జి జేసీ వైశాలి

  • పెదపెంకిలో అభివృద్ధి పనుల పరిశీలన

సీతానగరం(బలిజిపేట),జూలై1(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ లక్ష్యాల సాధనలో నిర్లక్ష్యం వహించరాదని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో వైశాలి అన్నారు. క్షేత్రస్థాయిలో అర్హులైన వారందరికీ సకాలంలో సంక్షేమ పథకాలు అందించాలని ఆదేశించారు. బుధవారం పెదపెంకిలో ఆమె విస్తృతంగా పర్యటించారు. గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. గడువులోగా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి క్షేత్ర స్థాయిలో అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. అనంతరం గ్రామంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను పంపిణీచేశారు. ఈ పర్యటనలో ఆర్డీవో కె.మాధురి, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, డీపీవో ఎస్‌.రవీంద్ర తదితరులు ఉన్నారు.

సర్‌ ప్రక్రియ వేగవంతం

సాలూరు: సర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ వైశాలి ఆదేశించారు. పారన్నవలస, మామిడిపల్లి, కందులపదం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా సర్‌, రీసర్వే ప్రక్రియపై ఆరా తీశారు. ఓటర్లు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడా లని అధికారులకు సూచించారు. రీ సర్వేకు ముందు ప్రతీ రైతుకు నోటీసు అందజేయాలన్నారు.

Updated Date - Jul 01 , 2026 | 11:51 PM