No Respite from the Heat! ఎండలు తగ్గట్లే!
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:06 AM
No Respite from the Heat! జిల్లాలో ఎండలు తగ్గడం లేదు. ఉదయం ఏడు గంటల నుంచే భానుగు తన ప్రతాపం చూపుతున్నాడు. మంగళవారం జిల్లావ్యాప్తంగా 42 డిగ్రీలుపైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ వేడి, ఉక్కపోతకు జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
విలవిల్లాడుతున్న మూగజీవాలు
పార్వతీపురం, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎండలు తగ్గడం లేదు. ఉదయం ఏడు గంటల నుంచే భానుగు తన ప్రతాపం చూపుతున్నాడు. మంగళవారం జిల్లావ్యాప్తంగా 42 డిగ్రీలుపైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ వేడి, ఉక్కపోతకు జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో మధ్యాహ్నం వేళల్లో పల్లె, పట్టణ ప్రాంతాల్లో ప్రధాన రహదారులు, కూడళ్లు నిర్మానుష్యంగా మారాయి. కొద్దిరోజుల్లోనే పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అయితే ఎండలు తీవ్రంగా ఉండడంతో పిల్లలను స్కూళ్లకు ఎలా పంపించాలో అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఎండవేడికి ప్రజలే కాదు పాడి పశువులు కూడా తట్టుకోలేకపోతున్నాయి. చాలాచోట్ల పెంపకందారులు ఉదయం 11 గంటల తర్వాత పశువులను తోటలు, చెట్లు ఉన్న ప్రాంతాలకు తరలిస్తున్నారు. గెడ్డలు, వాగుల్లో ఎండిపోవడంతో వంశధార నదికి తీసుకెళ్లి నీరు అందిస్తున్నారు. మొత్తంగా ఉష్ణ తాపానికి మూగజీవాలు సైతం విలవిల్లాడుతున్నాయి.