No Negligence రీసర్వే, ప్రజాసేవల్లో అలసత్వం వద్దు
ABN , Publish Date - Jun 22 , 2026 | 11:58 PM
No Negligence in Resurvey and Public Services రీసర్వే, ప్రజా సేవల్లో అలసత్వం వహించరాదని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆర్డీవో కె.మాధురితో కలిసి తహసీల్దార్లతో సమీక్షించారు.
పార్వతీపురం, జూన్22(ఆంధ్రజ్యోతి): రీసర్వే, ప్రజా సేవల్లో అలసత్వం వహించరాదని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆర్డీవో కె.మాధురితో కలిసి తహసీల్దార్లతో సమీక్షించారు. ప్రజలకు సేవలు అందించడంలో, రీ సర్వే ప్రక్రియలో ఎటువంటి సాంకేతిక సమస్యలు ఎదురైనా, వాటిని అధిగమించి.. సకాలంలో స్పందిం చాలన్నారు. షెడ్యూల్ ప్రకారం రీసర్వే వెరిఫికేషన్ ప్రక్రియను పక్కాగా పూర్తి చేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్‌లో ఉండకూడదని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా భూ రికార్డులు, సర్వే అధికారి విఘ్నేశ్వరరావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
చెరువులను సంరక్షించాలి
జలరక్షణ కార్యక్రమంలో భాగంగా చెరువులను సంరక్షించాలని ఎంపీడీవోలను ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ సూచించారు. హద్దుల గుర్తింపు విషయంలో తహసీ ల్దార్లు, ఎంపీడీవోలు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. చెరువుల చుట్టూ మొక్కలు నాటాలన్నారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికా రులతో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని నీటి వనరులు, చెరువుల సంరక్షణే ధ్యేయంగా పనిచేయాలన్నారు. ట్రెంచ్ తవ్వకాలకు సంబంధించి కలెక్టర్ సూచనలు పాటించాలని తెలిపారు.