Share News

No Negligence విధులపై నిర్లక్ష్యం వద్దు

ABN , Publish Date - Aug 07 , 2026 | 11:28 PM

No Negligence in Duties ప్రభుత్వ శాఖల్లోని అధికారులు విధులపై నిర్లక్ష్యం వహించరాదని సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్‌ పి.బాలకోటయ్య సూచించారు. సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్రలో భాగంగా శుక్రవారం ఆయన జిల్లాలో పర్యటించారు.

No Negligence  విధులపై నిర్లక్ష్యం వద్దు
గురుకుల పాఠశాలలో విద్యార్థినికి భోజనం వడ్డిస్తున్న బాలకోటయ్య

పార్వతీపురం టౌన్‌/ గరుగుబిల్లి, ఆగస్టు8(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ శాఖల్లోని అధికారులు విధులపై నిర్లక్ష్యం వహించరాదని సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్‌ పి.బాలకోటయ్య సూచించారు. సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్రలో భాగంగా శుక్రవారం ఆయన జిల్లాలో పర్యటించారు. తొలుత పార్వతీపురం పట్టణంలోని సాంఘిక బాలిక వసతి గృహంతోపాటు గరుగుబిల్లిలోని బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలను పరిశీలించారు. అనంతరం సాంఘిక సంక్షేమ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్లాది రుపాయాలను వెచ్చిస్తుందన్నారు. వసతి గృహాల్లోని విద్యార్థుల భవిష్యత్‌కు ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు. పిల్లలు దారితప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తెలిపారు. మన్యం లాంటి వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి ఫలాలు పూర్తిస్థాయిలో అవసరం ఉందన్నారు. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పాఠశాలలు, వసతి గృహల విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలిగినా సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనల మేరకు వసతి గృహాల్లో మెనూను అమలు చేయాలని ఆదేశించారు. ఏటా శతశాతం ఉత్తీర్ణత సాధించి.. మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. అనంతరం విద్యార్థులకు వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ఆయన వెంట జిల్లా సాంఘిక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎం.శ్యామల, గురుకుల జిల్లా కోఆర్డినేటర్‌ ఎస్‌.రూపావతి, కళాశాల ప్రిన్సిపాల్‌ ఎ.రాజకుమారి, వైద్యాధికారి రాంప్రసాద్‌ సాహు తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 07 , 2026 | 11:28 PM