నిర్వహణ లేక.. సాగు నీరందక
ABN , Publish Date - Feb 12 , 2026 | 12:01 AM
బొబ్బిలి, సీతాన గరం మండలాల్లోని పలుగ్రామాల పరిధిలోని వెంగళరాయసాగర్ సాగు నీటి కాలువల నిర్వహణ నీరుగారుతోంది. ప్రధానంగా ఈ ఏడాది కాలువల్లో పూడిక, తుప్పలు తొలగించలేదు.
బొబ్బిలి రూరల్, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): బొబ్బిలి, సీతాన గరం మండలాల్లోని పలుగ్రామాల పరిధిలోని వెంగళరాయసాగర్ సాగు నీటి కాలువల నిర్వహణ నీరుగారుతోంది. ప్రధానంగా ఈ ఏడాది కాలువల్లో పూడిక, తుప్పలు తొలగించలేదు. దీంతో తుప్పలు భాగా పెరగడంతోపాటు పూడికభారీగా చేరడంతో శివారు ఆయకట్టుకు నీరందడంలేదు. ఆయకట్టు రెతులకు ఏటా సాగునీరు ప్రశ్నార్ధకంగా మారుతోంది. గత ఏడాది ప్రధాన, పిల్ల కాలువల్లో కొన్నిచోట్లమాత్రమే పూడికలు తొలగించి లోతుచేశారు. ఏడాది రెండు మండలాల పరిధిలో 15 కిలోమీటర్ల మేర కాలువల్లో కనీస నిర్వహణ లేకపోవడంతో రెండు వేల ఎకరాలకు సాగు నీరందడం కష్టంగా మారింది. ఖరీఫ్‌లో కొంత మేర అందినా రబీలో పూర్తి స్థాయిలో నీరందని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. దీనికితోడు శిథిలావస్థకు చేరిన సిమెంట్ మదుములను కూడా మరమ్మతు చేయకుండా వదిలేశారు. బొబ్బిలి మండలంలోని గోపా లరాయుడుపేట, దిబ్బగుడ్డివలస, సీతయ్యపేట, రాజుపేట, సీతాన గరం మండలంలోని చిన్నబోగిలి, గుడ్డిపేట తదితర గ్రామాల్లో సిమెంట్ లైనింగ్ లేకపోవడంతో పూడిక పేరుకుపోయింది. ఈనేప థ్యంలో లింగమ్మవలస, కోమటిపల్లి వర్షాధారమైన శివారు ప్రాంతా ల్లోని పొలాలకు నీరందక నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధిపథకం నిధులతోనైనా కాలువల్లో పూడిక తొలగించాలని రైతులు కోరుతున్నారు. కాగా కాలువల్లో పూడిక తొలగింపునకు ప్రతిపాదనలను పంపించామని, నిధులు రాగానే ఖరీఫ్‌నాటికి పనులు పూర్తిచేస్తామని ఏఈ సుధీర్ తెలిపారు.