పరిశ్రమలకు భూములు ఇచ్చేది లేదు
ABN , Publish Date - Apr 07 , 2026 | 12:21 AM
పరిశ్రమల ఏర్పాటుకు తమ భూములు ఇచ్చేది లేదని భోగాపురం గ్రామానికి చెందిన రైతులు తెగించిచెప్పారు.
భోగాపురం పొలాల్లో రైతుల వంటా-వార్పు
భోగాపురం, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): పరిశ్రమల ఏర్పాటుకు తమ భూములు ఇచ్చేది లేదని భోగాపురం గ్రామానికి చెందిన రైతులు తెగించిచెప్పారు. ఈ మేరకు వారు సోమవారం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న భోగాపురం గ్రామంలోని పంట పొలాల్లో వంటా-వార్పు కార్యక్రమం నిర్వహించారు. పరిశ్రమలకు భూములు ఇచ్చేది లేదంటూ వీరు గత 61 రోజులుగా నిరసన చేపడుతున్నారు. ఈ నిరసన 60 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం వంటా-వార్పు నిర్వహించారు. రైతు నాయకులు కొమ్మూరు సుభోషణరావు, పడాల శ్రీనివాసరావు, గుండపు సూర్యారావు, రౌతు వాసుదేవరావు, నానాజీ తదితరులు పాల్గొన్నారు.