Share News

elephants. ఏనుగులతో ఏ నష్టం కలగకూడదు

ABN , Publish Date - Sep 14 , 2026 | 12:31 AM

No harm should be caused by the elephants. అటవీ ఏనుగుల సంచారంతో రైతులు, ప్రజలకు ఎటువంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గ్రీన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్సీ నాగబాబు సూచించారు. అటవీశాఖాధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.

  elephants.  ఏనుగులతో ఏ నష్టం కలగకూడదు
అటవీశాఖాధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ నాగబాబు

సీతానగరం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): అటవీ ఏనుగుల సంచారంతో రైతులు, ప్రజలకు ఎటువంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గ్రీన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్సీ నాగబాబు సూచించారు. అటవీశాఖాధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆదివారం గుచ్చిమి గ్రామంలో ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి మొక్కలు నాటారు. కుంకీ ఏనుగుల ఆరోగ్య పరిస్థితులు, సంరక్షణ చర్యలను పరిశీలించారు. ప్రజలు, వన్య ప్రాణుల మధ్య సంఘర్షణలు చోటు చేసుకోకుండా చూడాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విస్తృతంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం కుంకీలకు ఆహారం అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వన్య ప్రాణుల విభాగాధికారి రాహుల్‌పాండే, రాష్ట్ర అటవీశాఖ అధికారి మూర్తి, ఉత్తరాంధ్ర ఫారెస్ట్‌ అధికారి రాజు, జిల్లా ఇన్‌చార్జి అటవీశాఖాధికారి ఎస్‌.వెంకటేష్‌, ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 14 , 2026 | 12:31 AM