Share News

one-Minute Delay నిమిషం ఆలస్యమైనా అనుమతించం

ABN , Publish Date - Feb 14 , 2026 | 12:11 AM

No Entry Even for a One-Minute Delay జిల్లాలో ఈనెల 23 నుంచి మార్చి 18 వరకు జరగనున్న ఇంటర్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి (డీఐఈవో) వై.నాగేశ్వరరావు తెలిపారు.

 one-Minute Delay నిమిషం ఆలస్యమైనా అనుమతించం
విలేఖరులతో మాట్లాడుతున్న డీఐఈవో నాగేశ్వరరావు

  • జిల్లాలో 37 కేంద్రాల ఏర్పాటు

  • సకాలంలో విద్యార్థులు చేరుకోవాలి

  • డీఐఈవో నాగేశ్వరరావు

జియ్యమ్మవలస, ఫిబ్రవరి13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈనెల 23 నుంచి మార్చి 18 వరకు జరగనున్న ఇంటర్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి (డీఐఈవో) వై.నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన చినమేరంగిలో విలేఖర్లతో మాట్లాడుతూ... ‘ జిల్లాలో 33 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తాం. విద్యార్థులు సమయానికి పరీక్షా హాల్‌లో ఉండాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోం. రెండు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, రెండు సిటింగ్‌ స్క్వాడ్‌లు, డిస్ట్రిక్ట్‌ ఎగ్జామినేషన్స్‌ కమిటీ (డీఈసీ), కన్వీనర్‌ డీఐఈవో ఈ పరీక్షలను పర్యవేక్షిస్తారు. 57 మందిని ఇన్విజిలేటర్లు నియమించాం. కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు అనుమతించబోం. ఈ ఏడాది ఇంటర్‌ మొదటి సంవత్సరంలో బోటనీ, జువాలజీ కాకుండా ఈ రెండింటినీ కలపి బయాలజీ పేపరే ఉంటుంది. మేథ్స్‌ పేపర్‌ కూడా ఒకటే ఉంటుంది. కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాం. పరీక్షలు జంబ్లింగ్‌ పద్ధతిలో జరుగుతాయి. జిల్లాలో 14 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, 14 కేజీబీవీలు, 9 సోషల్‌ వెల్ఫేర్‌, 9 ట్రైబల్‌ వెల్ఫేర్‌ కళాశాలలు, 4 మోడల్‌ స్కూళ్లు, 34 ప్రైవేట్‌ కళాశాలలు, రెండు హైస్కూల్‌ ప్లస్‌లు ఉన్నాయి. వాటిల్లో వాటిలో 17,530 మంది విద్యార్థులు చదువుతున్నారు. గత నెల 27 నుంచి ఈనెల 10 వరకు మూడు విడతలుగా ఒకేషనల్‌ ప్రాక్టికల్స్‌, ఈనెల 1 నుంచి 10వ తేదీ వరకు రెండు విడతలుగా జనరల్‌ ప్రాక్టికల్స్‌ నిర్వహించాం.’ అని తెలిపారు.

Updated Date - Feb 14 , 2026 | 12:11 AM