‘వైద్యసేవల్లో జాప్యం వద్దు’
ABN , Publish Date - Oct 28 , 2026 | 12:40 AM
తుఫాన్ నేపఽథ్యంలో వైద్య సేవల్లో జాప్యం వద్దని వైద్యాఽకారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్‌సీడీ పీవో డాక్టర్ టి.జగన్మోహన్‌రావు సూచించారు.
పార్వతీపురం రూరల్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): తుఫాన్ నేపఽథ్యంలో వైద్య సేవల్లో జాప్యం వద్దని వైద్యాఽకారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్‌సీడీ పీవో డాక్టర్ టి.జగన్మోహన్‌రావు సూచించారు. మంగళవారం పెదబొండపల్లి పీహెచ్‌సీ ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అత్యవసర మందులు, పరికరాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్, విద్యుత్ బ్యాకప్, వ్యాక్సిన్ కోల్డ్‌చైన్ ఏర్పాట్లును పరిశీలిం చారు. గర్భిణులను ముందస్తుగా ఆసుపత్రులకు తరలించాల న్నారు. గ్రామాల్లో ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, జిల్లా అధికారులు సూచనలు పాటించాలన్నారు. కార్య క్రమంలో డాక్టర్ జి.ధరణి, డాక్టర్ డి.రమణకుమార్, ఆరోగ్య పర్యవేక్షకులు పాల్గొన్నారు.