డ్రంకెన్ డ్రైవ్ కేసులో తొమ్మిదిమందికి జైలు
ABN , Publish Date - Jan 08 , 2026 | 12:18 AM
మద్యం తాగి, వాహనాలు నడిపిన వారిపై పోలీసులు దృష్టి సారించారు.
ముమ్మరంగా తనిఖీలు
మద్యం తాగి, వాహనాలు నడిపిన వారిపై పోలీసులు దృష్టి సారించారు. ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తూ, పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి, జైలుకు తరలిస్తున్నారు.
కొత్తవలస, జనవరి 7(ఆంధ్రజ్యోతి): మద్యం తాగి వాహనాలను నడిపిన ఆరుగురికి కొత్తవలస న్యాయాధికారి డా.సముద్రాల విజయచందర్ ఒక్కొక్కరికి రూ.10వేల జరిమానా, వారం రోజుల జైలు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు ఇచ్చారు. ఇటీవల కొత్తవలస, లక్కవరపుకోట, వేపాడ మండలాల పోలీసు స్టేషన్ల పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారి విషయమై తనిఖీలు చేయగా కొత్తవలసలో ముగ్గురు, లక్కవరపుకోటలో ఇద్దరు, వేపాడలో ఒకరు పట్టుబడ్డారు. వీరిపై కేసులు నమోదు చేసి, బుధవారం కొత్తవలస కోర్టులో హాజరుపర్చారు. వీరు నేరం అంగీకరించడంతో రూ.10వేలు చొప్పున జరిమానా, ఏడు రోజుల జైలు శిక్ష విధించారు. వీరిని ఎస్.కోటలోని సబ్ జైలుకు తరలించారు.
వేపాడ, జనవరి7 (ఆంధ్రజ్యోతి): మద్యం తాగి ట్రాక్టర్ నడిపిన బొద్దాం గ్రామానికి చెందిన గళ్ల రమణ అనే వ్యక్తికి కొత్తవలస కోర్టు జైలు శిక్ష తోపాటు జరి మానా విధించినట్టు వల్లంపూడి ఎస్‌ఐ సుదర్శన్ బుధ వారం తెలిపారు. గళ్ల రమణ గత ఏడాది డిసెంబరు 6న ముకుందపురం వైపు నుంచి బొద్దాం వైపు ట్రాక్టర్ నడుపుతూ వస్తున్నాడు. అప్పటికే బొద్దాం సెంటర్‌లో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న వల్లంపూడి ఎస్‌ఐ సుదర్శన్.. ట్రాక్టర్‌ను నిలుపుదల చేసి, బ్రీత్ ఎనలైజ ర్‌తో తనిఖీ చేశారు. దీంతో గళ్ల రమణ మద్యం తాగి ఉన్నట్టు నిర్ధారించికుని, అతనిపై కేసు నమోదు చేశా రు. దర్యాప్తు అనంతరం బుధవారం రమణను కోర్టులో హాజరు పరిచారు. జేఎఫ్‌సీఎం కొత్తవలస కోర్టు మెజి స్ట్రేట్ ఆ.విజయచందర్.. రమణకు వారం రోజుల జైలు శిక్ష తోపాటు రూ.10వేలు జరిమానా విధించారు. ఈ మేరకు రమణను ఎస్.కోట సబ్ జైలుకు తరలించారు.
లక్కవరపుకోట, జనవరి 7(ఆంధ్రజ్యోతి): మం డలంలోని సంతపేట జంక్షన్ వద్ద ఎల్.కోట పోలీసులు బుధవారం నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఇద్దరి ని పట్టుకున్నారు. వీరికి వారం రోజులు జైలుశిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తూ కొత్తవలస కోర్టు మెజి స్ట్రేట్ విజయచందర్ తీర్పు ఇచ్చారని ఎస్‌ఐ నవీన్‌ప డాల్ తెలిపారు. ఎల్.కోట మండలం ఖాసాపేట గ్రామా నికి చెందిన గండిబోయిన దేముడు, కొత్తవలస మండ లం గొల్లలపాలెం గ్రామానికి చెందిన నంబూరు సుధీర్ లు ఇద్దరూ చెరో వాహనంపై మద్యం తాగి కొత్త వలస వైపు నుంచి ఎస్.కోట వైపు వెళ్తుండగా సంత పేట వద్ద జరిగిన తనిఖీల్లో వీరిని పట్టుకుని, కేసు నమోదు చేశా రు. వీరిని కొత్తవలస ఇచ్చిన కోర్టు తీర్పు మేరకు ఎస్.కోట సబ్ జైలుకు తరలించారు.