‘ఇన్‌స్పయిర్’ పోటీల్లో నిఖిల ప్రతిభ
ABN , Publish Date - Jun 21 , 2026 | 12:17 AM
రాష్ట్ర స్థాయి ఇన్‌స్పయిర్ మానక్ పోటీల్లో సీతారాం పురం జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని శివ్వాల నిఖిల ప్రతిభ కనబరిచింది.
వంగర, జూన్ 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర స్థాయి ఇన్‌స్పయిర్ మానక్ పోటీల్లో సీతారాం పురం జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని శివ్వాల నిఖిల ప్రతిభ కనబరిచింది. రాష్ట్ర వాప్తంగా శనివా రం నిర్వహించిన ఆన్‌లైన్ పోటీల్లో 15 ప్రోజె క్టులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. వీటిలో నిఖిల రూపొందించిన ఆటోమెటిక్ వ్యవసా య క్షేత్ర పర్యవేక్షణ వ్యవస్థ ప్రోజెక్టు ఎంపిక య్యింది. ఈసందర్భంగా విద్యార్థినిని ఉపాధ్యా యులు, గ్రామస్థులు అభినందించారు.