Share News

ఎయిర్‌పోర్టుతో నూతన అవకాశాలు

ABN , Publish Date - Jul 27 , 2026 | 12:29 AM

భోగాపురంలోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు వల్ల ఉత్తరాంధ్రలో పారిశ్రా మిక, పర్యాటక, వాణిజ్య రంగాల్లో నూతన అవకాశాలు లభించనున్నాయని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్‌ తెలిపారు.

 ఎయిర్‌పోర్టుతో నూతన అవకాశాలు
మాట్లాడుతున్న కోండ్రు మురళీమోహన్‌ :

రాజాం, జూలై 26 (ఆంధ్రజ్యోతి): భోగాపురంలోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు వల్ల ఉత్తరాంధ్రలో పారిశ్రా మిక, పర్యాటక, వాణిజ్య రంగాల్లో నూతన అవకాశాలు లభించనున్నాయని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్‌ తెలిపారు. ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి నూతన దిశను చేసే చారిత్రాత్మక ప్రాజెక్టుగా నిలవనుం దని చెప్పారు. ఆదివారం శ్యాంపురం క్యాంపుకార్యాలయం లో నియోజకవర్గ స్థాయిలో నాయకులు, కార్యకర్తలతో ఆగస్టు ఒకటో తేదీన భోగాపురం విమానాశ్రయాన్ని మోదీ ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు. రాజాం నియోజకవర్గంలో చేపట్టాల్సిన ఏర్పాట్లు, జనసమీకరణపై సమీక్షించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కొల్ల అప్పలనాయుడు, నంది సూర్యప్రకాష్‌రావు, సమల వెంకటమన్మఽథరావు, పిల్లా సత్యంనాయుడు, వంగా వెంకటరావు, శాసపు రాజేష్‌కుమార్‌, పిన్నింటి మోహ్‌రావు, గట్టి భాను వల్లూరు గణేష్‌, గురవాన నారా యణరావు, దుప్పలపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2026 | 12:30 AM