Cell Towers సెల్ టవర్లపై అల్లుకున్న నిర్లక్ష్యం
ABN , Publish Date - Jul 16 , 2026 | 11:26 PM
Negligence Looms Over Cell Towers జిల్లాలో పలు సెల్ టవర్లు ప్రమాదకరంగా మారాయి. ముళ్లపొదలు, తుప్పలు, తీగలతో నిండి అధ్వానంగా దర్శమనిస్తున్నాయి. ఇదే సమయంలో విష సర్షాలకు నిలయంగా మారుతున్నాయి.
విష సర్పాలకు నిలయంగా టవర్లు
కానరాని క్లీన్ అండ్ గ్రీన్
భయాందోళనలో ప్రజలు
జియ్యమ్మవలస, జూలై16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు సెల్ టవర్లు ప్రమాదకరంగా మారాయి. ముళ్లపొదలు, తుప్పలు, తీగలతో నిండి అధ్వానంగా దర్శమనిస్తున్నాయి. ఇదే సమయంలో విష సర్షాలకు నిలయంగా మారుతున్నాయి. వాస్తవంగా జిల్లాలోని 15 మండలాల పరిధిలో దొరికిన చోట సెల్ టవర్లు ఏర్పాటు చేశారు. అయితే వాటి నిర్వహణను మాత్రం సదరు కంపెనీ ప్రతినిధులు పట్టించుకోవడం లేదు. టవర్ల వద్ద పారిశుధ్యం లోపించినా, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగినా తమకేమీ పట్టనట్లు వారు వ్యవహరిస్తున్నారు. జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామ నడిబొడ్డులో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ పరిస్థితే ఇందుకు నిదర్శనం. దీనిచుట్టూ కొన్ని రకాల మొక్కలు, తీగలు అల్లుకున్నాయి. మరికొన్ని రోజులు ఇలా వదిలేస్తే టవరే కనబడని పరిస్థితి. రాత్రి వేళల్లో ఇక్కడి నుంచే సమీప ఇళ్లలోకి విష సర్పాలు చేరుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ప్రాణనష్టం సంభవించకముందే సంబంధిత టవర్ల ఇంజనీర్లు స్పందించి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టాలని పల్లెవాసులు డిమాండ్ చేస్తున్నారు.