Share News

Negligence Duties విధి నిర్వహణలో నిర్లక్ష్యం

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:19 AM

Negligence in the Discharge of Duties పాలకొండ పంచాయతీరాజ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ జి.రవిని సరెండ్‌ చేస్తూ.. కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై రాష్ట్ర పంచాయతీ రాజ్‌ సెక్రటరీలకు లేఖ రాశారు. విధి నిర్వహణలో అలసత్వం కారణంగానే ఈ చర్యలు తీసుకు న్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.

Negligence  Duties విధి నిర్వహణలో నిర్లక్ష్యం

పార్వతీపురం, ఫిబ్రవరి23(ఆంధ్రజ్యోతి): పాలకొండ పంచాయతీరాజ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ జి.రవిని సరెండ్‌ చేస్తూ.. కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై రాష్ట్ర పంచాయతీ రాజ్‌ సెక్రటరీలకు లేఖ రాశారు. విధి నిర్వహణలో అలసత్వం కారణంగానే ఈ చర్యలు తీసుకు న్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రధానంగా గతేడాది భామినిలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన సమయంలో, అదేవిధంగా గిరిశిఖర గ్రామాల్లో రహదారుల పనులు పూర్తి చేయిం చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా సెలవు పెట్టడంతో పీఆర్‌ ఈఈని సరెండర్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ రాధారాణికి ఆ బాధ్యతలను అప్పగిస్తూ కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Feb 24 , 2026 | 12:19 AM