Share News

NEET PG exam today నేడు నీట్‌ పీజీ పరీక్ష

ABN , Publish Date - Aug 30 , 2026 | 12:01 AM

NEET PG exam today జిల్లాలోని ఆదివారం నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష జరగనుంది. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకూ పరీక్ష జరగనుంది. విజయనగరంలోని గాజులురేగ ఆయాన్‌ డిజిటల్‌ జోన్‌లో మాత్రమే నీట్‌ పీజీ పరీక్షకు ఏర్పాట్లు చేశారు.

NEET PG exam today నేడు నీట్‌ పీజీ పరీక్ష
మాట్లాడుతున్న కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

నేడు నీట్‌ పీజీ పరీక్ష

హాజరుకానున్న 475 మంది విద్యార్థులు

పక్కాగా ఏర్పాట్లు

కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

విజయనగరం కలెక్టరేట్‌, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఆదివారం నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష జరగనుంది. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకూ పరీక్ష జరగనుంది. విజయనగరంలోని గాజులురేగ ఆయాన్‌ డిజిటల్‌ జోన్‌లో మాత్రమే నీట్‌ పీజీ పరీక్షకు ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 475 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. ఉదయం 7 గంటలకే పరీక్ష కేంద్రానికి హాజరు కావాలని అధికారులు సూచించారు. నీట్‌ పీజీ పరీక్షపై పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదేశించారు. పరీక్ష నిర్వహణపై శనివారం సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్లు, ఎలక్ర్టానిక్‌ పరికరాలు, ఇతర గాడ్జెట్లు, ఆభరణాలు అనుమతించకూడదని స్పష్టంచేశారు. పరీక్ష కేంద్రంలో సెల్‌ జామర్లు ఏర్పాటు చేసినందున నెట్‌ వర్క్‌ సదుపాయం అందుబాటులో ఉండదన్నారు. కేంద్రంలోకి ఒకసారి ప్రవేశించిన తరువాత పరీక్ష పూర్తయ్య వరకూ అభ్యర్థులు బయటకు వెళ్లేందుకు అవకాశం ఉండదన్నారు. పరీక్ష కేంద్రం వద్ద బిఎన్‌ఎస్‌ 163 సెక్షన్‌ అమల్లో ఉంటుందని చెప్పారు. పరిసర ప్రాంతాల్లో జిరాక్స్‌ కేంద్రాలకు మూసివేయాలని సూచించారు. పరీక్ష కేంద్రం వద్ద ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి మహిళా వైద్యురాలిని అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి జీవనరాణిని కలెక్టర్‌ ఆదేశించారు. అలాగే ఉదయం 7 గంటలకు నుంచి పరీక్ష పూర్తయ్యే వరకూ తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు ఆదేశించారు. సమావేశంలో ఇన్‌చార్జి డీఆర్‌వో అరుణకుమారి ఉన్నారు.

Updated Date - Aug 30 , 2026 | 12:01 AM