NEET Coaching Center in Model School మోడల్ స్కూల్‌లో నీట్ శిక్షణ కేంద్రం
ABN , Publish Date - Apr 01 , 2026 | 11:41 PM
NEET Coaching Center in Model School అక్కివరం ఏపీ మోడల్ స్కూల్‌లో నీట్ శిక్షణ కేంద్రం బుధవారం ప్రారంభమైంది. ఉమ్మడి 5 జిల్లాల ఏపీ మోడల్ స్కూళ్ల నుంచి ఎంపిక చేసిన వంద మంది విద్యార్థినులకు ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు.
మోడల్ స్కూల్‌లో నీట్ శిక్షణ కేంద్రం
5 జిల్లాల నుంచి విద్యార్థినుల హాజరు
నెలాఖరు వరకు శిక్షణ: ప్రిన్సిపాల్
డెంకాడ, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి):
అక్కివరం ఏపీ మోడల్ స్కూల్‌లో నీట్ శిక్షణ కేంద్రం బుధవారం ప్రారంభమైంది. ఉమ్మడి 5 జిల్లాల ఏపీ మోడల్ స్కూళ్ల నుంచి ఎంపిక చేసిన వంద మంది విద్యార్థినులకు ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. మంత్రి నారా లోకేశ్ ఆలోచనతో ఈ కేంద్రం ఏర్పాటైంది. నెల రోజులపాటు మిషన్ మోడల్ మైండ్స్ పేరుతో నీట్- 2026 కోచింగ్ క్లాసులు ఉత్తమ ఉపాధ్యాయులతో ప్రారంభించినట్టు ప్రిన్సిపాల్ సీహెచ్ సంధ్య తెలిపారు. విద్యార్థినులందరికీ హాస్టల్, వసతి అందజేస్తామన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యంనాయుడు కోచింగ్ సెంటర్‌ను లాంఛనంగా ప్రారంభించారు. విద్యార్థులంతా ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖరరావు, సర్పంచ్ కంది కిరణ్, స్కూల్ చైర్మన్ కంది అప్పలనాయుడు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.