విద్యార్థులకు ‘ప్రకృతి’ పాఠాలు
ABN , Publish Date - Mar 25 , 2026 | 12:16 AM
ప్రకృతి వల్ల మానవాళికి ఒనగూరుతున్న ప్రయోజనాలు, పరిరక్షించే విధానం, పర్యావరణాన్ని కాపా డాల్సిన అవశ్యకత తదితర అంశాలపై ఉపాధ్యాయులు ప్రకృతి ఒడిలో విద్యార్థులకు పాఠాలు బోధించారు.
సాలూరు రూరల్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి ): ప్రకృతి వల్ల మానవాళికి ఒనగూరుతున్న ప్రయోజనాలు, పరిరక్షించే విధానం, పర్యావరణాన్ని కాపా డాల్సిన అవశ్యకత తదితర అంశాలపై ఉపాధ్యాయులు ప్రకృతి ఒడిలో విద్యార్థులకు పాఠాలు బోధించారు. పార్వతీపురం మన్యం జిల్లా డీఈవో పి.బ్రహ్మాజీరావు మార్గదర్శకం మేరకు ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో ఉన్న ఏవోబీ తూర్పు కనుమల అడవుల్లోకి మంగళవారం సాలూరు, పాచిపెంట మండలాల్లో ఉన్న మామిడిపల్లి, సాలూరు వేదసమాజం, మహాత్మజ్యోతిరావు ఫూలే, పాచిపెంట మండలం మాతుమూరు, పాంచాళి ఉన్నత పాఠశాలల విద్యార్థులను ఉపాధ్యాయులు తీసుకెళ్లారు. నేషనల్ గ్రీన్ కోర్ మన్యం జిల్లా కో ఆర్డినేటర్లు రాజారావు, జానకి, డీపీ కుమార్, అడవుల పై పాంచాలి ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు మెయిద కృష్ణారావు.. ఏవోబీ తూర్పు కనుమల్లో ఒడిశాకు అనుకొని ఉన్న సాలూరు మండలం కరడ వలస, నారింజపాడు, బొడ్డపాడు తదితర గ్రామాల్లో విద్యార్థుల పర్యటనకు ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణ, జలవనరుల పెంపుదల, అడవుల వల్ల ప్రయోజనం, జీవులకు నీటి అవసరం కోసం వివరించారు. కార్యక్రమం లో ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.