జాతీయ స్థాయి కరాటే పోటీలు ప్రారంభం
ABN , Publish Date - Oct 05 , 2026 | 12:10 AM
కరాటే ఆత్మ రక్షణకే కాదని, శరీర ధారుడ్యానికి, ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు.
కొత్తవలస, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): కరాటే ఆత్మ రక్షణకే కాదని, శరీర ధారుడ్యానికి, ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. తుమ్మికాపల్లి పంచాయతీలోని ఒక కల్యాణ మండపంలో నిర్వహించిన 14వ జాతీయ కరాటే పోటీలను ఆమె ఆదివారం ప్రారంభించారు. 3.0 ఇన్విటేషన్ చాంపియన్ కప్-2026 పేరుతో నిర్వహించిన పోటీలకు 14 రాష్ట్రాల నుంచి 728 మంది హాజరయ్యారు. ఈసంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇటువంటి పోటీలను కొత్తవలసలో ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకంగా ఉందన్నారు. ఏపీ ఒకినోవా స్పోర్ట్సు కరాటే -డో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను కర్రి సూర్యనూకరాజు నిర్వహించగా వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులతో పాటు దాసరి కార్పొరేషన్ చైర్మన్ పీవీ రత్నాజీ, కొత్తవలస పీఏసీఎస్ అధ్యక్షుడు కోళ్ల వెంకటరమణ, విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం బీసీ సెల్ ఉపాధ్యక్షుడు బొబ్బిలి అప్పారావు, టీడీపీ నాయకులు పిల్లా అప్పలరాజు, గొంప దుర్గాఉమేష్, పప్పు అప్పలరాజు, వల్లెపు కైలాష్ తదితరులు పాల్గొన్నారు.