‘జాతి ఐకమత్యమే లక్ష్యం’
ABN , Publish Date - Jun 19 , 2026 | 12:21 AM
మన జాతి ఐకమత్యమే లక్ష్యమని తూర్పుకాపు సంక్షేమ సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు పి.చంద్రమోహన్ అన్నారు.
పార్వతీపురం టౌన్, జూన్ 18 (ఆంధ్ర జ్యోతి): మన జాతి ఐకమత్యమే లక్ష్యమని తూర్పుకాపు సంక్షేమ సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు పి.చంద్రమోహన్ అన్నారు. గురువారం పట్టణంలోని ఎన్‌జీవో హోంలో మన్యం జిల్లా తూర్పుకాపు సంక్షేమ సంఘ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిఽథిగా హాజరై మాట్లాడారు. మనం అన్నిరంగాల్లో రాణించాలంటే ప్రణాళికబద్దంగా ముందుకసాఆగాల్సి ఉందన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని తూర్పుకాపులకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలని, ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నామన్నారు. ఉత్తరాంధ్రలో రాజకీయ ఎదగాలంటే మనమంతా ఏకతాటిపై నడవాల్సిందేనన్నారు. కాపుజాతి మధ్య ఎవరూ చిచ్చు పెట్టలేరన్నారు. మనమంతా సమష్టిగా సమస్యల పరిష్కరించుకునే సమయం ఆనస్నమైయ్యిందన్నారు. కార్యక్రమంలో సంఘ జాతీయ గౌరవ అధ్యక్షుడు గిరిశ్వరరావు, సంఘ నాయకులు బార్నాల సీతారామ్, పిన్నింటి జయకృష్ణ, జి.వెంకటరమణ పాల్గొన్నారు.