Share News

జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడి పర్యటన వాయిదా

ABN , Publish Date - Mar 31 , 2026 | 12:21 AM

జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాతోతు హుస్సేన్‌ నాయక్‌ పర్యటన వాయిదా పడడంతో గిరిజనులు ఊసూరుమ న్నారు.

జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడి పర్యటన వాయిదా

శృంగవరపుకోట, మార్చి 30(ఆంధ్రజ్యోతి): జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాతోతు హుస్సేన్‌ నాయక్‌ పర్యటన వాయిదా పడడంతో గిరిజనులు ఊసూరుమ న్నారు. తమ సమస్యలను చెప్పుకునేందుకు ఆశతో వచ్చిన వీరందరికీ నిరాసన ఎదురైంది. ఎస్టీ కమిషన్‌ సభ్యుడు సోమవారం ఎస్‌.కోట మండలంలో పర్యటిస్తు న్నట్టు తహసీల్దార్‌ డి.శ్రీనివాసరావు ప్రకటించిన సంగతి తెలిసిందే. స్థానిక ఆర్‌కే ఫంక్షన్‌ హాల్‌లో బహిరంగ సభకు ఏర్పాటు చేస్తున్నట్టు తెలియజేయడంతో మండల పరిధిలోని గిరిజనులతో పాటు ఇతర మండలాలకు చెందిన గిరిజనులు, మండలానికి ఆనుకుని ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలా నికి చెందిన గిరిజనులు తరలి వచ్చారు. ఇంతలో జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యు డు రావడం లేదన్న విషయాన్ని ఉదయం 10గంటల సమయంలో అధికారులు బయటపెట్టారు. దీంతో గిరిజనులు ఆందోళన చేశారు. ప్రధానంగా జిందాల్‌ భూ నిర్వాసిత రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిరాశతో వెనుదిరిగారు.

Updated Date - Mar 31 , 2026 | 12:21 AM