నాగావళికి వరద
ABN , Publish Date - Jul 28 , 2026 | 11:44 PM
తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదికి వరద పోటెత్తుతోంది. మంగళవారం ఎగువ ప్రాంతం ఒడిశాలో వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి 3,500 క్యూసెక్కుల మేర వరద చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
గరుగుబిల్లి, జూలై 28(ఆంధ్రజ్యోతి): తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదికి వరద పోటెత్తుతోంది. మంగళవారం ఎగువ ప్రాంతం ఒడిశాలో వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి 3,500 క్యూసెక్కుల మేర వరద చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా స్పిల్‌వే గేట్లు నుంచి దిగువకు 2,200 క్యూసెక్కులను విడుదల చేశారు. సాగునీటి అవసరాలకు ప్రధాన కాలువల నుంచి 1,220 క్యూసెక్కులను విడుదల చేశారు. పైప్రాంతాల్లో ఇంకా వర్షాలు కురిస్తే.. వరద ప్రవాహం కొంతమేర పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రాజెక్టు అధికారులు బి.కిషోర్‌కుమార్, శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. కాగా మండలంలో చెదురు ముదురు వర్షాలు కురిశాయి. అయితే ఉబాలుకు సరిపడకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. కాగా చిరుజల్లులతో నారుమళ్లు తేరుకునే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.