Share News

My Wife Is Still Alive, Sir! నా భార్య బతికే ఉంది సారూ!

ABN , Publish Date - Aug 25 , 2026 | 12:21 AM

My Wife Is Still Alive, Sir! ‘ నా భార్య బతికే ఉంది సారూ.. రేషన్‌ కార్డులో పేరు యాడ్‌ చేయండి.. ’ అంటూ పార్వతీపురం మండలం సామాడవలస గ్రామానికి చెందిన కొండతామర టికున అనే గిరిజనుడు వేడుకున్నాడు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ పీజీ ఆర్‌ఎస్‌లో అధికారులకు వినతిపత్రం ఇచ్చాడు.

My Wife Is Still Alive, Sir! నా భార్య బతికే ఉంది సారూ!
పీజీఆర్‌ఎస్‌లో ఆవేదన వ్యక్తం చేస్తున్న టికున

  • సచివాలయ సిబ్బంది తప్పిదంపై పీజీఆర్‌ఎస్‌లో గిరిజనుడి ఆవేదన

పార్వతీపురం, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ‘ నా భార్య బతికే ఉంది సారూ.. రేషన్‌ కార్డులో పేరు యాడ్‌ చేయండి.. ’ అంటూ పార్వతీపురం మండలం సామాడవలస గ్రామానికి చెందిన కొండతామర టికున అనే గిరిజనుడు వేడుకున్నాడు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ పీజీ ఆర్‌ఎస్‌లో అధికారులకు వినతిపత్రం ఇచ్చాడు. ‘తల్లి మృతి చెందితే.. నా భర్య బోరమ్మ మరణిం చినట్లుగా సచివాలయ సిబ్బంది నమోదు చేశారు. దీంతో రేషన్‌ కార్డులో బోరమ్మ పేరును తొల గించారు. ప్రతినెలా పూర్తిస్థాయిలో రేషన్‌ అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. సంక్షేమ పథకాలకు దూరం కావల్సి వస్తోంది.’ అని ఆ గిరిజనుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తక్షణమే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నాడు. కాగా ఈ తప్పును సరిదిద్ది బోరమ్మ పేరును రేషన్‌కార్డులో యాడ్‌ చేస్తామని డీఎస్‌వో అశోక్‌ ఈ సందర్భంగా చెప్పారు.

Updated Date - Aug 25 , 2026 | 12:21 AM