‘Mustabu’ ప్రతి పాఠశాలలో ‘ముస్తాబు’ తప్పనిసరి
ABN , Publish Date - Jul 01 , 2026 | 11:50 PM
‘Mustabu’ Mandatory in Every School జిల్లాలోని ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ముస్తాబు కార్యక్రమాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎంఈవోలు, హెచ్‌ఎంలతో సమీక్షించారు.
పార్వతీపురం, జూలై 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ముస్తాబు కార్యక్రమాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎంఈవోలు, హెచ్‌ఎంలతో సమీక్షించారు. తొలుత సుమారు 78 పాఠశాలల నుంచి 500 మంది విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా మాట్లాడారు. అనంతరం కలెక్టర్ మాట్లా డుతూ.. ప్రతి పాఠశాలలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా శుభ్రత పాటించాలన్నారు. తప్పనిసరిగా వాటర్‌బెల్ ఉండాలన్నారు. ప్రతీ విద్యార్థి బ్యాటరీ టెస్ట్ పాస్ కావాలన్నారు. స్కూల్ అయిపోయిన తర్వాత సాయంత్రం ఒక గంట పాటు వారితో వ్యాయామం చేయించాలని ఆదేశించారు. ముస్తాబు కార్యక్రమానికి సంబంధించి 94414 16148 నెంబర్‌తో ఒక వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసినట్లు తెలిపారు. ఆ నెంబర్‌కు హాయి అని పెడితే కొన్ని ఆప్షన్లు వస్తాయన్నారు. ప్రతి పాఠశాల విద్యార్థి విధిగా చేతులు శుభ్రం చేసుకోవాలని, వారాని రెండుసార్లు గోర్లు కట్ చేసుకోవాలని, నీట్‌గా తలదువ్వుకుని, ఉతికి ఇస్ర్తీ చేసిన దుస్తులు వేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డీఈవో పి. బ్రహ్మాజీరావు తదితరులు పాల్గొన్నారు.