Share News

Ugadi ఉగాదిలోగా పూర్తి చేయాల్సిందే..

ABN , Publish Date - Feb 06 , 2026 | 11:37 PM

Must Be Completed by Ugadi నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఉగాది పండుగలోగా జిల్లాలో గృహ నిర్మాణాలను పూర్తిచేయాలని జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. పెండింగ్‌ పనులన్నీ పూర్తి చేయాలని.. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

  Ugadi ఉగాదిలోగా  పూర్తి చేయాల్సిందే..
సమావేశంలో మాట్లాడుతున్న జేసీ

పార్వతీపురం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఉగాది పండుగలోగా జిల్లాలో గృహ నిర్మాణాలను పూర్తిచేయాలని జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. పెండింగ్‌ పనులన్నీ పూర్తి చేయాలని.. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్‌, గిరిజన సంక్షేమం, గ్రామీణ నీటి సరఫరా తదితర శాఖల ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్షించారు. మండలాల్లో పెండింగ్‌లో ఉన్న 1500 ఇళ్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. గ్రామ సచివాలయాల పరిధిలో మంజూరైన గృహాలు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులు, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ అవుతున్న డేటాకు మధ్య భారీ వ్యత్యాసాలు ఉండడంపై మండిపడ్డారు. సాంకేతిక కారణాల సాకుతో పనులను జాప్యం చేయొద్దన్నారు. ప్రస్తుతం లింటల్‌ లెవెల్‌ దశలో ఉన్న ఇళ్లకు వెంటనే శ్లాబు వేయించేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని ఆదేశించారు. రహదారులు, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించడంలో జాప్యం లేకుండా చూడాలని సూచించారు.

Updated Date - Feb 06 , 2026 | 11:37 PM