Share News

శత శాతం స్ట్రైక్‌ రేటు సాధించాలి

ABN , Publish Date - Nov 15 , 2026 | 12:31 AM

రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఐక్యంగా పనిచేసి నూటికి నూరు శాతం స్ట్రైక్‌ రేటు సాధించాలని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు సూచించారు.

శత శాతం స్ట్రైక్‌ రేటు సాధించాలి

  • చీపురుపల్లి ఎమ్మెల్యే కళావెంకటరావు

చీపురుపల్లి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఐక్యంగా పనిచేసి నూటికి నూరు శాతం స్ట్రైక్‌ రేటు సాధించాలని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు సూచించారు. శనివారం ఆయన రాజాంలోని తన నివాసంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. చీపురుపల్లి, గరివిడి మేజరు పంచాయతీలతో సహా మండలంలోని అన్ని పంచాయతీల్లో టీడీపీ మద్దతుదారులు గెలిచే విధంగా నాయకులు ప్రణాళికలు తయారు చేసుకోవాలని ఆయన సూచించారు. ఎక్కడా రాజీ పడకుండా ప్రతి పంచాయతీలోనూ గెలుపే ప్రధానంగా కార్యకర్తలు, నాయకులు పని చేయాలన్నారు. వార్డుల వారీగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఏయే వార్డుల్లో ఎవరిని సభ్యులుగా నెలబెట్టాలన్న అంశంపై మాట్లాడుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, రౌతు కామునాయుడు, దన్నాన రామచంద్రుడు, గవిడి నాగరాజు, ముల్లు రమణ, ఇజరోతు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2026 | 12:32 AM