Share News

Must Account ‘ లెక్క ’చెప్పాల్సిందే

ABN , Publish Date - Jun 24 , 2026 | 12:12 AM

Must Account for Every Rupee గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాడు-నేడు పథకం కింద చేపట్టిన అంగన్‌వాడీ భవన నిర్మాణాల్లో కనీసం ఒక్కటి కూడా ప్రారంభానికి నోచుకోలేదు. టెండర్లు పిలవకుండానే గతంలో కమిటీలు ఏర్పాటు చేసి.. ఆ పార్టీకి చెందిన కొంతమంది ప్రతినిధులతో పనులు చేపట్టారు. అయితే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు నిధులు వెచ్చించారనే ఆరోపణలున్నాయి.

Must Account   ‘ లెక్క ’చెప్పాల్సిందే
గరుగుబిల్లి మండలం కేఆర్‌ఎం వలసలో మధ్యలో నిలిచిన అంగన్‌వాడీ భవన నిర్మాణం

  • పనులు పూర్తిచేయకుండానే.. కమిటీల పేరిట నిధులు డ్రా..

  • ఖర్చుల్లో అవకతవకలు.. కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు

  • దృష్టిసారించిన జిల్లా అధికారులు

  • నిధుల వివరాలు అందించాలని ఆదేశం

పార్వతీపురం,జూన్‌23(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాడు-నేడు పథకం కింద చేపట్టిన అంగన్‌వాడీ భవన నిర్మాణాల్లో కనీసం ఒక్కటి కూడా ప్రారంభానికి నోచుకోలేదు. టెండర్లు పిలవకుండానే గతంలో కమిటీలు ఏర్పాటు చేసి.. ఆ పార్టీకి చెందిన కొంతమంది ప్రతినిధులతో పనులు చేపట్టారు. అయితే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు నిధులు వెచ్చించారనే ఆరోపణలున్నాయి. చాలాచోట్ల భవన నిర్మాణాలు పూర్తికాకముందే నిధులు డ్రా చేశారు. మొత్తంగా పనులు మాత్రం పూర్తిచేయలేకపోయారు. దీనిపై ఫిర్యాదులు వెళ్లడంతో కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా అధికారులు కదిలారు. నాడు-నేడు కింద గతంలో చేపట్టిన అంగన్‌వాడీ కేంద్ర భవనాల పనులు, ఖర్చుల వివరాలను సేకరించే పనిలో పడ్డారు.

ఇదీ పరిస్థితి...

- జిల్లాలో 699 అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో 156 కేంద్రాలు నడుస్తున్నాయి. కాగా 1224 కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు.

- గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో 112 అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఒక్కో భవనం నిర్మాణానికి రూ.12 లక్షల చొప్పున కేటాయించారు. నిధులు మంజూరైన వెంటనే పనులు పూర్తి చేసినట్టు లెక్కలు చూపించకపోతే.. ఆ నిధులు వెనక్కి వెళ్లిపోతాయని అప్పట్లో ప్రచారం సాగింది. దీంతో కమిటీలు.. భవన నిర్మా ణాలు పూర్తికాకముందే విద్యుత్‌ సామగ్రితో పాటు గ్రానైట్‌ పలకలు కొనుగోలుకు నిధులు ఖర్చు చేసినట్టు చూపించాయి. ఇందులో 11 భవనాలకు శ్లాబులు పూర్తయ్యాయి. మరో 28 శ్లాబ్‌ లెవెల్‌లో ఉన్నాయి. 52 భవనాలు రూఫ్‌ లెవెల్‌లో, 17 బేస్‌మెంట్‌ లెవెల్‌లో ఉన్నాయి. మూడు భవనాలకు ఫ్లోరింగ్‌ చేయాల్సి ఉంది. ఒక భవన నిర్మాణాన్ని పూర్తిగా ప్రారంభించలేదు.

పూర్తి చేసేందుకు చర్యలు

అసంపూర్తిగా నిలిచిన అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణాలు పూర్తి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగానే జిల్లాలో తొలి విడతగా 12 భవనాలకు రూ.37.50 లక్షల చొప్పన 15వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించారు. కొమరాడ, గరు గుబిల్లి, బలిజిపేట , మక్కువ , పాచిపెంట మండలాల్లో ఇప్పటికే భవన నిర్మాణాలు ప్రారంభ మయ్యాయి. ఈ పనులు చేపడితే కనీసం 12 భవనాలైనా అందుబాటులోకి రానున్నాయి.

ఖర్చుల వివరాలు అడిగాం..

నాడు-నేడు కింద కమిటీల ద్వారా కొనుగోలు చేసిన మెటీరియల్‌, ఇతర ఖర్చుల వివరాలు అందించాలని ఆదేశించాం. నాడు-నేడు భవన నిర్మాణాలపై ప్రగతి నివేదికను ఉన్నతాధికారులకు అందించాం.

- కనకదుర్గ, పీడీ, ఐసీడీఎస్‌

Updated Date - Jun 24 , 2026 | 12:12 AM