Share News

అప్పులు తీర్చేందుకు హత్య

ABN , Publish Date - Mar 29 , 2026 | 12:20 AM

చెడు వ్యసనాలకు బానిసై, ఎక్కడికక్కడ అప్పులు చేసిన ఓ యువకుడు.. ఆ అప్పులు తీర్చేందుకు వృద్ధురాలిని హత్య చేశాడని పోలీసులు తేల్చారు.

అప్పులు తీర్చేందుకు హత్య

బెలగాం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): చెడు వ్యసనాలకు బానిసై, ఎక్కడికక్కడ అప్పులు చేసిన ఓ యువకుడు.. ఆ అప్పులు తీర్చేందుకు వృద్ధురాలిని హత్య చేశాడని పోలీసులు తేల్చారు. మక్కువ మండలంలో జరిగిన హత్య కేసుకు సంబంధించిన వివరాలను శనివారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు. మక్కువ మండలం మేళాపువలస గ్రామానికి చెందిన మేళాపు సింహాచలం(67) ఈనెల 20న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై మక్కువ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా వృద్ధురాలు మృతి చెందిన రాత్రి ఆమె ఇంటి ముందు ద్విచక్ర వాహనం ఉందని స్థానికుల చెప్పడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ నెల 28న అనుమానంతో అదే గ్రామానికి చెందిన చొంగలి ఈశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. నిందితుడి నేరాన్ని అంగీకరించాడన్నారు. నిందితుడు ఈశ్వరరావు తనకు అప్పులు ఎక్కువుగా ఉండడం వల్ల ఒంటరిగా ఉంటున్న వరసకు మేనత్త అయిన మేళాపు సింహాచ లంను మెడ నొక్కి హత్య చేసి, బంగారు గొలుసును తీసుకుని వెళ్లిపోయాడన్నా రు. నిందితుడిని నుంచి బంగారు గొలుసును స్వాఽధీనం చేసుకుని అరెస్ట్‌ చేశామన్నారు. కార్యక్రమంలో పార్వతీపురం ఏఎస్పీ మనీషారెడ్డి, సీఐ అప్పల నాయుడు, మక్కువ ఎస్‌ఐ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2026 | 12:21 AM