Murder of a married woman వివాహిత హత్య
ABN , Publish Date - Oct 26 , 2026 | 12:24 AM
Murder of a married woman ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు.. వివాహం తర్వాత రాజాంలోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగేళ్లపాటు ఇంజినీరింగ్ చదివిన భార్య ట్రాన్స్‌కోలో చిరుద్యోగంలో చేరింది. ప్రస్తుతం అసిస్టెంట్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తోంది.
వివాహిత హత్య
భర్తే హంతకుడా..?
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీస్, డాగ్‌స్కా ్వడ్, క్లూస్ టీంలు
మృతురాలు ట్రాన్స్‌కోలో ఏఈ
రాజాం కొండంపేటలో ఘటన
రాజాం రూరల్, అక్టోబరు 25(ఆంరఽధజ్యోతి): ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు.. వివాహం తర్వాత రాజాంలోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగేళ్లపాటు ఇంజినీరింగ్ చదివిన భార్య ట్రాన్స్‌కోలో చిరుద్యోగంలో చేరింది. ప్రస్తుతం అసిస్టెంట్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఆరంకెల జీతం. బంగారం లాంటి ఇద్దరు పిల్లలు.. భర్త కూడా చెప్పుల షోరూం నడుపుతున్నాడు. హాయిగా సాగుతున్న వారి జీవితంలో ఏం జరిగిందో మరి.. భార్య హత్యకు గురైంది. భర్తే చంపేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. డాగ్‌స్క్వాడ్ మృతదేహం నుంచి నేరుగా హతురాలి ఇంటికి, ఆపై ప్రత్యేక గదిలో ఉన్న భర్త వద్దకు వెళ్లి నిలిచిపోవడంతో భర్తే హంతకుడని పోలీసులు భావిస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రాజాం మున్సిపాలిటీ పరిధిలోని కొండంపేట గ్రామంలో ఆదివారం వేకువజామున నాలుగు గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి సలాది నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్తే హత్య చేశాడన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు రాజాం టౌన్ సీఐ నవీన్‌కుమార్ వెల్లడించారు. పోలీసులు, బాధితురాలి తండ్రి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
రాజాంలోని కొండంపేట ప్రాంతానికి చెందిన గుడివాడ సీతారామరాజుకు లలితతో 23 ఏళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఆమె చీపురుపల్లి ట్రాన్స్‌కో ఏఈగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. సీతారామరాజు రాజాంలోనే చెప్పుల షోరూం నడుపుతున్నాడు. అయితే కొన్నాళ్లుగా భార్య, భర్త మధ్య మనస్పర్థలు వచ్చాయి. లలితపై అనుమానం పెంచుకున్న భర్త రాజు తరచూ వేధిస్తూ, గొడవలు పడుతూ ఉన్నాడని, ఈ క్రమంలోనే ఆదివారం ఆమెను తీవ్రంగా గాయపరిచి కొండంపేట నుంచి రాజాం వెళ్లే మార్గంలో చంపేశాడని లలిత తండ్రి నాగేశ్వరరావు రాజాం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. భర్తే చంపి ఉంటాడన్న అనుమానంతో కేసు నమోదు చేసినట్లు రాజాం టౌన్ సీఐ నవీన్‌కుమార్ తెలిపారు.
రంగంలోకి దిగిన డాగ్‌స్క్వాడ్
ఘటనా స్థలంలో హత్య జరిగిన లక్షణాలు కనిపిస్తున్న నేపథ్యంలో రాజాం పోలీసుల సూచనల మేరకు క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్ రంగంలోకి దిగాయి. క్లూస్ సిబ్బంది ఆ ప్రాంతంలో ఉన్న ట్రాలీబ్యాగ్, ఇతరత్రా అనుమానిత ప్రదేశాలలో వేలిముద్రలు సేకరించారు. డాగ్‌ను రంగంలోకి దించడంతో కొండంపేటలోని రాజు ఇంటికి వెళ్లడంతో పాటు ప్రత్యేక గదిలో ఉంచిన భర్త రాజు వద్దకు వెళ్లి ఆగింది. దీంతో లలితకుమారిది హత్యేనని, హత్యచేసింది భర్తేనని పోలీసులు ప్రాఽథమికంగా నిర్ధారణకొచ్చారు.