murder సిమెంట్ ఇటుకతో కొట్టి.. వేడి నూనె పోసి
ABN , Publish Date - Sep 18 , 2026 | 12:08 AM
murder తనను వెంట తీసుకెళ్లాల్సిందేనని ఆమె నిలదీసింది. అతను రేపుమాపు అంటూ వాయిదా వేస్తూ వచ్చాడు. బుధవారం రాత్రి ఇద్దరూ గొడవపడ్డారు. ఆమె విచక్షణ కోల్పోయింది. కోపంతో ఊగిపోయింది. సిమెంట్ ఇటుకతో అతని తలపై బలంగా మోదింది. నూనె వేడిచేసి అతని ఒంటిపై పోసింది. ప్రమాదమని చిత్రీకరించేందుకు యత్నించింది. అతను చనిపోయాక.. తానూ విషపూరిత మందు నీటిలో కలుపుకుని తాగింది. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటోంది. గరివిడి మండలం కందిపేట గ్రామంలో ఈ ఘోరం చోటుచేసుకుంది.
సిమెంట్ ఇటుకతో కొట్టి.. వేడి నూనె పోసి
సహజీవనం చేస్తున్న వ్యక్తిని హత్య చేసిన మహిళ
కందిపేటలో ఘటన
- తనను వెంట తీసుకెళ్లాల్సిందేనని ఆమె నిలదీసింది. అతను రేపుమాపు అంటూ వాయిదా వేస్తూ వచ్చాడు. బుధవారం రాత్రి ఇద్దరూ గొడవపడ్డారు. ఆమె విచక్షణ కోల్పోయింది. కోపంతో ఊగిపోయింది. సిమెంట్ ఇటుకతో అతని తలపై బలంగా మోదింది. నూనె వేడిచేసి అతని ఒంటిపై పోసింది. ప్రమాదమని చిత్రీకరించేందుకు యత్నించింది. అతను చనిపోయాక.. తానూ విషపూరిత మందు నీటిలో కలుపుకుని తాగింది. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటోంది. గరివిడి మండలం కందిపేట గ్రామంలో ఈ ఘోరం చోటుచేసుకుంది.
- వారిద్దరూ దూరపు బంధువులు. అప్పటికే ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఇద్దరి మధ్య ఐదేళ్ల నుంచి సన్నిహిత సంబంధం ఉంది. ఒకరు విశాఖలో.. ఒకరు కందిపేట గ్రామంలో ఉన్నారు. అప్పుడప్పుడూ కలుసుకునే వారు. ఇటీవలే దండలు కూడా మార్చుకున్నారు. ఒక విషయమై వారి మధ్య జరిగిన గొడవ ఘోరానికి దారితీసింది.
గరివిడి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి):
విశాఖలోని మల్కాపురం బాలాజీనగర్‌లో జీవీఎంసీ స్వీపర్‌గా పనిచేస్తున్న దన్నాల శ్రీను (36)కు, వరసకు పిన్నమ్మ అయిన కందిపేట గ్రామానికి చెందిన దన్నాల రాములమ్మకు ఐదు సంవత్సరాలుగా వివాహేతర సంబంధం నడుస్తోంది. శ్రీనుకు తన తాతల నుంచి వచ్చిన భూమి కందిపేట గ్రామంలో ఉంది. అది చూసేందుకు కందిపేట వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో పిన్నవరస అయిన రాములమ్మతో స్నేహం పెంచుకున్నాడు. కాలక్రమేనా ఇది సహజీవనానికి(వివాహేతర సంబంధం) దారితీసింది. వీరిద్దరూ రాములమ్మ ఇంటిలోనే దండలు మార్చుకొని ఎనిమిది నెలల క్రితం వివాహం కూడా చేసుకున్నారు. అప్పటి నుంచి రాములమ్మ తనను విశాఖ తీసుకువెళ్లమని శ్రీనుపై తీవ్ర ఒత్తిడి చేసింది. శ్రీను తరచూ వాయిదా వేసేవాడు. రెండు నెలల క్రితం సమస్యను రాములమ్మ గ్రామ పెద్దల దృష్టికి కూడా తీసుకువెళ్లింది. ఇదిలా ఉండగా ఈ నెల 12వ తేదీన శ్రీను కందిపేటలోని రాములమ్మ ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి ఆమె వద్దే ఉన్నాడు. బుధవారం రాత్రి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తురాలైన రాములమ్మ మంచం కింద ఉన్న సిమెంట్ ఇటుకతో శ్రీను తలపై పలుమార్లు దాడిచేసింది. ఆపై రక్తపు మడుగులో కొనఊపిరితో ఉన్న శ్రీనుపై రాములమ్మ ఇంటిలో ఉన్న నూనెను సలసలా మరగబెట్టి శ్రీను ఒంటిపై పోసి ప్రమాదవశాత్తు జరిగినట్టు చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. దీంతో శ్రీను అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనతో భయపడిన తాను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఇంటిలో ఉన్న చీమలగుండను నీటిలో కలుపుకొని తాగేసింది. విషయం తెలుసుకున్న స్థానికులు రాములమ్మను చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదిలా ఉండగా రాములమ్మ, శ్రీనుకు ఇదివరకే వేరే వారితో వివాహం జరిగింది. రాములమ్మనను భర్త విడిచిపెట్టేశాడు. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉండగా ఒకరికి వివాహమైంది. ఇంకొక కుమార్తె తండ్రి వద్ద విశాఖలో ఉంటోంది. శ్రీను తన భార్యను వదిలేసి విశాఖలో ఉంటున్నాడు. ప్రస్తుతానికి రాములమ్మ చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. శ్రీను తండ్రి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చీపురుపల్లి సీఐ బి.శంకరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు గరివిడి పోలీసులు తెలిపారు.