Share News

26 నుంచి మునిసిపల్‌ కార్మికుల సమ్మె

ABN , Publish Date - Jan 18 , 2026 | 12:14 AM

మునిసిపల్‌ కార్మికుల సమస్యలపై ఈనెల 23న ధర్నా చేపడతామని, 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని సీఐటీయూ నాయకులు పి.శంకరరావ తెలిపారు. బొబ్బిలి మునిసిపాలిటీలో కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.

26 నుంచి మునిసిపల్‌ కార్మికుల సమ్మె
మాట్లాడుతున్న సీఐటీయూ నాయకులు :

బొబ్బిలి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ కార్మికుల సమస్యలపై ఈనెల 23న ధర్నా చేపడతామని, 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని సీఐటీయూ నాయకులు పి.శంకరరావ తెలిపారు. బొబ్బిలి మునిసిపాలిటీలో కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. శనివారం బొబ్బిలిలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మునిసిపాలిటీలో105 మంది కార్మికులు పనిచేస్తుండగా కేవలం 30 మందికి మాత్రమే నూనె, సబ్బులు, యూనిఫామ్‌ దుస్తులు, చెప్పులు ఇచ్చి చేతులు దులుపుకొ న్నారని చెప్పారు. ప్రజల ఆరోగ్యం కోసం శ్రమిస్తున్న వారికి మొం డి చేయి, వివక్ష చూపడం తగదన్నారు. మృతిచెందిన ముగ్గురు కార్మికుల కుటుంబాల వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలని గత ఏడాది నుంచి కోరుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. సాలూరు మునిసిపాలిటీలో చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తున్న, ఇక్కడ నిబంధనల పేరుతో అడ్డుపుల్ల వేస్తున్నారని తెలిపారు. ఇతర మునిసిపాలిటీల్లో లేని నిబంధనలు ఈ ఒక్క మున్సి పాలిటీలోనే పాటిం చడం సమంజసం కాదన్నారు. సమా వేశంలో కార్మిక ప్రతి నిధులు జి.వాసు, ప్రసాద్‌, కూర్మారావు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2026 | 12:14 AM