రెండో రోజుకు మున్సిపల్ కార్మికుల రిలే దీక్ష
ABN , Publish Date - Mar 08 , 2026 | 12:14 AM
తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు నెల్లిమర్ల నగర పంచాయతీ కార్యాలయం వద్ద రెండో రోజు శనివారం రిలే దీక్ష కొనసాగించారు.
నెల్లిమర్ల, మార్చి 7(ఆంధ్రజ్యోతి): తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు నెల్లిమర్ల నగర పంచాయతీ కార్యాలయం వద్ద రెండో రోజు శనివారం రిలే దీక్ష కొనసాగించారు. ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ, జిల్లా కమిటీ సభ్యుడు కె.రామారావు మాట్లాడుతూ విధి నిర్వహణలో మరణించిన తుపాకు ల రవణమ్మ, బొమ్మాలి వెంకట్ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వకపోతే నిరవదిక సమ్మెకు సిద్ధం అవుతామని హెచ్చరించారు. అలాగే జీతాలు పెంపు, రిటైర్ మెంట్ బెనిఫిట్స్ రూ.5లక్షలు, మట్టి ఖర్చులు, ఎక్స్‌గ్రేషియో పెంపు, సంక్షేమ పథకాల అమలు, మహిళా కార్మికుల సమస్యలపై ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు, పీరియడ్స్ సమయంలో వేతనంతో కూడిన సెలవు తదితర డిమాండ్లతో ఈ రిలే దీక్ష చేపట్టినట్టు తెలిపారు. సీఐ టీయూ జిల్లా కార్య దర్శి సీహెచ్ వెంకటేష్, హరిబా బు, యూనియన్ జిల్లా కోశాధికారి బి.హరిబాబు, నా యకులు రాము, దుర్గారావు, బాలరాజు పాల్గొన్నారు.