Muggu ముగ్గు మనోహరం
ABN , Publish Date - Jan 04 , 2026 | 12:32 AM
Muggu Magic జిల్లా కేంద్రానికి ముందే సంక్రాంతి వచ్చింది. రంగవల్లులతో ఇంద్రధనస్సు నేలకు వాలిందా అన్న చందంగా మారింది. ముగ్గులు వేసేందుకు జిల్లా నలమూలల నుంచి తరలివచ్చిన మహిళలతో కళకళలాడింది. పార్వతీపురంలో ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది.
ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు
(పార్వతీపురం -ఆంధ్రజ్యోతి)
జిల్లా కేంద్రానికి ముందే సంక్రాంతి వచ్చింది. రంగవల్లులతో ఇంద్రధనస్సు నేలకు వాలిందా అన్న చందంగా మారింది. ముగ్గులు వేసేందుకు జిల్లా నలమూలల నుంచి తరలివచ్చిన మహిళలతో కళకళలాడింది. పార్వతీపురంలో ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగవల్లులు తీర్చిదిద్దారు. ముచ్చట గొలిపే ముగ్గులతో ఆ ప్రాంతమంతా సప్తవర్ణ శోభితమైంది. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో శనివారం నిర్వహించిన ‘ఆంధ్ర జ్యోతి, ఏబీఎన్’ నిర్వహించిన సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలకు సన్ ఫీస్ట్ మ్యాజిక్ మామ్స్ బిస్కెట్, టేస్ట్ పార్టనర్ స్వస్తిక్ మసాలా, ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ భారత్ వాసి అగరబత్తీ సహకారం అందించాయి. లోకల్ స్పాన్సర్‌గా శ్రీ వెంకటేశ్వర జ్యూయల్ ప్యాలెస్ వ్యవహరించింది. యువతులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొని సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా రంగవల్లులు తీర్చిదిద్దారు. విభిన్న రంగులతో రంగవల్లికలను తీర్చిదిద్ది.. నగదు ప్రోత్సాహకాలు, బహుమతులు అందుకున్నారు.