Share News

MPP seat won by TDP ఎంపీపీ పీఠం టీడీపీ కైవసం

ABN , Publish Date - Jan 06 , 2026 | 12:04 AM

MPP seat won by TDP బాడంగి ఎంపీపీ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఇక్కడి పాలకవర్గం మైనారిటీలో పడడంతో కొద్దిరోజులుగా అవిశ్వాసంపై చర్చలు జరుగుతున్నాయి. కోడూరు ఎంపీటీసీ సభ్యురాలు మరిపి శ్రీదేవి, గూడెపువలస ఎంపీటీసీ సభ్యుడు పూడి సింహాచలం ఇటీవల టీడీపీలో చేరడంతో టీడీపీ మద్దతు సభ్యుల సంఖ్య తొమ్మిదికి చేరింది.

MPP seat won by TDP ఎంపీపీ పీఠం టీడీపీ కైవసం
కొత్త ఎంపీపీ, వైస్‌ఎంపీపీలను అభినందిస్తున్న ఎమ్మెల్యే బేబీనాయన, బుడా చైర్మన్‌ తెంటు

ఎంపీపీ పీఠం టీడీపీ కైవసం

బాడంగి ఎంపీపీగా లక్ష్మీ

బాడంగి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): బాడంగి ఎంపీపీ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఇక్కడి పాలకవర్గం మైనారిటీలో పడడంతో కొద్దిరోజులుగా అవిశ్వాసంపై చర్చలు జరుగుతున్నాయి. కోడూరు ఎంపీటీసీ సభ్యురాలు మరిపి శ్రీదేవి, గూడెపువలస ఎంపీటీసీ సభ్యుడు పూడి సింహాచలం ఇటీవల టీడీపీలో చేరడంతో టీడీపీ మద్దతు సభ్యుల సంఖ్య తొమ్మిదికి చేరింది. మొత్తం 14 మంది సభ్యుల్లో వీరికే మెజారిటీ ఉండడంతో వైసీపీకి చెందిన ఎంపీపీ భోగి గౌరి, వైస్‌ ఎంపీపీ బొమ్మినాయని రమేష్‌లపై టీడీపీ సభ్యులు సోమవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయంలో మండల ప్రత్యేకాధికారి కిరణ్‌కుమార్‌ ఎన్నిక ప్రక్రియను చేపట్టారు. ఒక్కొక్క నామినేషన్‌ మాత్రమే పడ్డాయి. ఎంపీపీ పదవికి యజ్జల లక్ష్మి పేరును వైస్‌ ఎంపీపీ సింగిరెడ్డి భాష్కరరావు ప్రతిపాదించగా వాడాడా ఎంపీటీసీ రెడ్డి సునీత బలపరిచారు. వైస్‌ ఎంపీపీ పదవికి పాలవలస గౌరి పేరును గొల్లాది ఎంపీటీసీ పి.సత్యవతి ప్రతిపాదించగా ముగడ ఎంపీటీసీ మత్స త్రినాథ బలపరిచారు. వైసీపీ ఎంపీటీసీలంతా గైర్హాజరయ్యారు. టీడీపీ సభ్యులు 9 మంది మద్దతు ఇవ్వడంతో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలుగా యజ్జల లక్ష్మి, పాలవలస గౌరి ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి కిరణ్‌కుమార్‌ ప్రకటించారు. ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలను ఎమ్మెల్యే బేబీనాయన, బుడా చైర్మన్‌ లక్ష్ముంనాయుడు అభినందించారు. అనంతరం టీడీపీ శ్రేణులు మందుగుండు సామగ్రి కాల్చుతూ సంబరాలు చేసుకున్నాయి. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు తెంటు రవిబాబు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 12:04 AM