Share News

MPP Oath-Taking Ceremony రేపే ఎంపీపీల ప్రమాణ స్వీకారం

ABN , Publish Date - Nov 18 , 2026 | 12:28 AM

MPP Oath-Taking Ceremony Tomorrow జిల్లాలోని 15 మండలాల పరిధిలో ఎంపీపీల ప్రమాణ స్వీకారోత్సవానికి వేళయింది. ఈ మేరకు గురువారం మండల పరిషత్‌ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అధికార యత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముందుగా ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అవసరమైన చోట చేతులెత్తే పద్ధతిలో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలను ఎన్నుకుంటారు.

MPP Oath-Taking Ceremony   రేపే ఎంపీపీల ప్రమాణ స్వీకారం

పార్వతీపురం, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 15 మండలాల పరిధిలో ఎంపీపీల ప్రమాణ స్వీకారోత్సవానికి వేళయింది. ఈ మేరకు గురువారం మండల పరిషత్‌ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అధికార యత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముందుగా ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అవసరమైన చోట చేతులెత్తే పద్ధతిలో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలను ఎన్నుకుంటారు. సింగిల్‌ నామినేషన్‌ పడిన చోట డైరెక్ట్‌గా ఎంపీపీల పేర్లను ప్రకటిస్తారు. తర్వాత కో ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకుంటారు. మన్యంలోని 226 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. టీడీపీ అభ్యర్థులు 123 స్థానాల్లో గెలుపొందారు. జనసేన 37, బీజేపీ 2, ఇతరులు 2 స్థానాల్లో విజేతలుగా నిలిచారు. వైసీపీ 62 ఎంపీటీసీ స్థానాలకే పరిమితమైంది. గుమ్మలక్ష్మీపురం మండలంలో గట్టి పోటీ నెలకొంది. ఇక్కడ ఎంపీటీసీ స్థానాలు 14 ఉండగా.. వైసీపీకి ఏడు, టీడీపీకి ఏడు స్థానాలు లభించాయి. దీంతో ఎంపీపీ పీఠం కోసం ఇరు పార్టీల నేతలు పట్టుపడుతున్నారు. సీతంపేట, మక్కువ మండలాల్లో వైసీపీ, మిగిలిన 12 మండలాల్లో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు ఎంపీపీగా ఎన్నిక కానున్నారు.

Updated Date - Nov 18 , 2026 | 12:28 AM