సహాయ నిరాకరణలో ఎంపీఈవోలు
ABN , Publish Date - Jul 21 , 2026 | 12:18 AM
వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఎంపీఈవో(మల్టీపర్పస్ ఎక్సెటెన్షన్ ఆఫీసర్స్) సోమవారం నుంచి 25వ తేదీ వరకు సహాయ నిరాకరణ చేస్తున్నట్టు ప్రకటించారు.
కొత్తవలస, జూలై 20(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఎంపీఈవో(మల్టీపర్పస్ ఎక్సెటెన్షన్ ఆఫీసర్స్) సోమవారం నుంచి 25వ తేదీ వరకు సహాయ నిరాకరణ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో భాగంగానే కొత్తవలస వ్యవసాయ శాఖసబ్ డివిజన్ పరిధిలోని కొత్తవలస, వేపాడ మండల వ్యవసాయ శాఖాధికారులకు వినతిపత్రాలను ఇచ్చారు. గత 12 సంవత్సరాలుగా ఎంపీఈవోలకు రూ.12వేల వేతనంతో పాటు రూ.3వేలు ఇన్సెంటివ్ మాత్రమే ఇస్తున్నారని, ప్రస్తుతం ఉన్న ధరలకు అనుగుణంగా వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. గత నాలుగు నెలల నుంచి ఆ జీతాలు కూడా ఇవ్వడం లేదన్నారు. నెలకు కనీసం రూ.35వే లు ఇవ్వాలని, శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాద బీమాతో పాటు విధి నిర్వహణలో మృతిచెందిన వారికి నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు.
వేపాడ, జూలై 20(ఆంధ్రజ్యోతి): తమ సమస్యలు పరిష్కారం కోరుతూ సోమవారం నుంచి సహాయ నిరాకరణ చేస్తున్నట్టు మల్టీపర్పస్ ఎక్సెటెన్షన్ ఆఫీసర్లు తెలిపారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖాధికారి వీటీ రామారావుకు సోమవారం వినతిప త్రం అందజేశారు.