ప్రధానితో ఎంపీ కలిశెట్టి భేటీ
ABN , Publish Date - Aug 08 , 2026 | 12:23 AM
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు తన కుటుంబ సభ్యులతో కలసి శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
మోదీకి చేనేత వస్త్రాలు బహూకరణ
న్యూఢిల్లీ, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు తన కుటుంబ సభ్యులతో కలసి శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ అ య్యారు. ఈ సందర్భంగా ప్రధానికి కలిశెట్టి కుటుంబ సభ్యులు చేనేత వస్త్రాలను కానుకగా అందించారు. విజ యనగరం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని చేనేత కార్మికులు స్వయంగా నేసిన ఆ దుస్తులను స్వీక రించిన ప్రధాని మోదీ, అప్పలనాయుడు కుటుంబానికి ఆత్మీయ స్వాగతం పలికారు. ఇటీవల జరిగిన భోగాపు రం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్య క్రమం గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావిం చారు. ఆ ఈవెంట్‌ను నిర్వహించిన తీరు అత్యంత అద్భుతంగా ఉందని కితాబు ఇచ్చారు. మంత్రి లోకేశ్ కార్యక్రమాన్ని నిర్వహించిన విధానం చాలా బాగుందని మోదీ ప్రశంసించారు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో దూరదృష్టి పాలనపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని ఎంపీ కుమార్తె కలిశెట్టి నిఖిల ప్రధానితో అన్నప్పుడు ఆయన ఆ వ్యాఖ్యలతో ఏకీభవించారు. కలిశెట్టి క్రమశిక్షణను ప్రధాని మోదీ ఈ సందర్భంగా కొనియాడారు. ‘‘అప్పలనాయుడు ఎంతో క్రమశిక్షణ కలిగిన ప్రజాప్రతినిధి. పార్లమెంటు సమావేశాలకు ఆయన ప్రతిరోజూ సైకిల్‌పై రావడం నేను గమనించా’’ అని ఎంపీ కుటుంబ సభ్యులకు తెలి పారు. చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం ప్రధాని విడుదల చేసిన ప్రత్యేక వీడియోను చూశా మని, అందుకే తమ కుటుంబమంతా ఈ రోజు చేనేత వస్ర్తాలను ధరించి వచ్చామని ఎంపీ కుమార్తె కలిశెట్టి నిఖిల ప్రధానికి వివరించారు.