Share News

కుమారుడికి తలకొరివి పెట్టిన తల్లి

ABN , Publish Date - Nov 03 , 2026 | 12:30 AM

కుమారుడికి తల్లి తలకొరివి పెట్టిన ఘటన పాలకొండలోని గేదెలవారివీధిలో చోటు చేసుకుంది.

 కుమారుడికి తలకొరివి పెట్టిన తల్లి
కుమారుడికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న తల్లి

పాలకొండ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): కుమారుడికి తల్లి తలకొరివి పెట్టిన ఘటన పాలకొండలోని గేదెలవారివీధిలో చోటు చేసుకుంది. గేదెలవారి వీధికి చెందిన టేకి శ్రీనివాసరావు దీర్ఘకాలిక వ్యాధి సోమవారం మృతి చెందారు. అంత క్రియలు నిర్వహించేందుకు కుటుంబంలో ఇతరులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో తల్లి వెంకమ్మ.. కుమారుడికి తలకొరివి పెట్టి అంత్యక్రియలు పూర్తిచేసింది. శ్రీనివాసరావు అంత్యక్రియలకు స్థానికులు గార దుర్గారావు, దుప్పాడ వెంకటరమణ, గార వెంకటరమణ మూర్తి, గార విజయబాబు, ఆరంగి హరిప్రసాద్‌, దుప్పాడ రాంబాబు, బాబ్జీ, సింహాద్రి, కృష్ణ తదితరులు ఆర్థికసాయం చేశారు.

‘

Updated Date - Nov 03 , 2026 | 12:31 AM