Mosquito Control దోమల నిర్మూలనతో వ్యాధుల నియంత్రణ
ABN , Publish Date - Aug 21 , 2026 | 12:03 AM
Mosquito Control for Disease Prevention దోమల నిర్మూలనతోనే వ్యాధుల నియంత్రణ సాధ్యమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి పి.విజయలక్ష్మీ తెలిపారు. ప్రపంచ దోమల నివారణ దినం సందర్భంగా గురువారం వైద్య సిబ్బందితో కలిసి పార్వతీపురంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి జిల్లా కేంద్రాసుపత్రి వరకు అవగాహనా ర్యాలీ నిర్వహించారు.
పార్వతీపురం, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): దోమల నిర్మూలనతోనే వ్యాధుల నియంత్రణ సాధ్యమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి పి.విజయలక్ష్మీ తెలిపారు. ప్రపంచ దోమల నివారణ దినం సందర్భంగా గురువారం వైద్య సిబ్బందితో కలిసి పార్వతీపురంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి జిల్లా కేంద్రాసుపత్రి వరకు అవగాహనా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దోమల ద్వారా మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా, చికున్‌గున్యా, మొదడువాపువంటి వ్యాధులు వ్పాప్తి చెందుతాయన్నారు. అందుకే ఎక్కడా నీరు నిల్వా లేకుండా చూసుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలన్నారు. హైరిస్క్ గ్రామాలు, హాస్టళ్లలో దోమతెరలు పంపిణీ చేశామన్నారు. ఐఆర్‌ఎస్ స్ర్పేయింగ్, ప్రత్యేక వైద్య శిబిరాల ద్వారా సీజనల్ వ్యాధులు నియం త్రణకు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు.