Share News

More surveillance on technological crimes సాంకేతిక నేరాలపై మరింత నిఘా

ABN , Publish Date - Jul 15 , 2026 | 12:08 AM

More surveillance on technological crimes సాంకేతిక నేరాలపై మరింతగా నిఘా పెట్టాలని... పోలీసు, రెవెన్యూ, వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ఉండి శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేయాలని కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో అర్ధసంవత్సర నేర సమీక్షా సమావేశం మంగళవారం జరిగింది.

More surveillance on technological crimes సాంకేతిక నేరాలపై మరింత నిఘా
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టరు రామసుందర్‌రెడ్డి

సాంకేతిక నేరాలపై మరింత నిఘా

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి

నేర సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి

విజయనగరం/ దాసన్నపేట, జూలై 14 (ఆంధ్రజ్యోతి): సాంకేతిక నేరాలపై మరింతగా నిఘా పెట్టాలని... పోలీసు, రెవెన్యూ, వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ఉండి శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేయాలని కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో అర్ధసంవత్సర నేర సమీక్షా సమావేశం మంగళవారం జరిగింది. కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ పరస్పర సమన్వయం, సమష్టి బాధ్యతతో పని చేయడం వల్ల విజయనగరం జిల్లా రాష్ట్రంలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించి ఉన్నత స్థానంలో నిలిచిందన్నారు. ఇదేస్ఫూర్తిని మున్ముందూ కొనసాగిస్తూ జిల్లాను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని చెప్పారు. విశాఖ రేంజ్‌ ఐజీ గోపీనాథ్‌ జట్టీ మాట్లాడుతూ, పోలీసు అధికారులు సాంకేతిక నైపుణ్యాలను, నూతన చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. తాత్కాలిక ప్రతిష్ట కోసం కాకుండా, పోలీసు వ్యవస్థ ప్రతిష్ట శాశ్వతంగా వుండేలా పనిచేయాలన్నారు. జిల్లా న్యాయాధికారి ఎం.బబిత మాట్లాడుతూ, జిల్లాలో పోక్సో కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా దర్యాప్తు అధికారులు పనిచేస్తున్నారన్నారు. కోర్టు విధులను మరింత సులభతరం చేసేందుకు కోర్టు లైజైన్‌ అధికారులను నియమించాలని, సాక్షులకు సరైన రక్షణ కల్పించాలని, నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌లు సకాలంలో అమలు చేయాలన్నారు.

ఎస్పీ దామోదర్‌ మాట్లాడుతూ, గత ఏడాదితో పోల్చితే మహిళలపై దాడులు,రహదారి ప్రమాదాలు తగ్గాయన్నారు. మహిళల రక్షణ కోసం శక్తియాప్‌పై విస్తృత అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నామని, గ్రామాల్లో రాత్రి బస చేసేందుకు పల్లె నిద్రను కూడా అన్ని మండలాల్లో చేపడుతున్నామన్నారు. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతూ, రూ.3.50కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేశామని, నిందితులపై నిఘా కోసం 360 డిగ్రీల యాప్‌ సీసీ కెమెరాలు, డ్రోన్‌లు వాడుతున్నామన్నారు. సమీక్ష సమావేశంలో ఏఎస్‌పీ సౌమ్యలత, ఎక్సైజ్‌, రవాణా, ఆర్టీసీ, నగరపాలక సంస్థ, విద్యుత్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ, డీఎంహెచ్‌ఓతో పాటు డీఎస్పీలు రాఘవులు, గోవిందరావు,నర్సింరావు, వీరకుమార్‌, న్యాయసలహాదారుడు పరుశురామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2026 | 12:08 AM