Share News

More security for the airport ఎయిర్‌పోర్టుకు మరింత భద్రత

ABN , Publish Date - May 28 , 2026 | 12:41 AM

More security for the airport భోగాపురం (అల్లూరి సీతారామరాజు) అంతర్జాతీయ గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయాన్ని అత్యవసర సేవల ప్రదేశంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కేంద్ర భద్రతా బలగాల ఆధీనంలోకి వెళ్లనుంది. ఈ మేరకు మౌలిక సదుపాయాల కల్పనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు నోటిఫికేషన్‌ జారీ చేశారు.

More security for the airport ఎయిర్‌పోర్టుకు మరింత భద్రత
భోగాపురం ఎయిర్‌పోర్టు

ఎయిర్‌పోర్టుకు మరింత భద్రత

ఆధీనంలోకి తీసుకోనున్న కేంద్ర బలగాలు

ప్రకటించిన ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు

భోగాపురం, మే27(ఆంధ్రజ్యోతి): భోగాపురం (అల్లూరి సీతారామరాజు) అంతర్జాతీయ గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయాన్ని అత్యవసర సేవల ప్రదేశంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కేంద్ర భద్రతా బలగాల ఆధీనంలోకి వెళ్లనుంది. ఈ మేరకు మౌలిక సదుపాయాల కల్పనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు నోటిఫికేషన్‌ జారీ చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అప్పుడప్పుడు విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. కొద్దిరోజుల్లో ప్రారంభోత్సవం జరుగనుండడంతో భోగాపురం విమానాశ్రయాన్ని 1971 అత్యవసర సేవల పరిధిలోకి తీసుకోవాలని విమానాశ్రయాభివృద్ధి సంస్థకు జీఎంఆర్‌ సంస్థ ప్రతిపాదన పంపింది. దీనిపై స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. విమానాశ్రయం మరో రెండు వారాల్లో పూర్తిస్థాయిలో కేంద్ర భద్రతా బలగాల ఆధీనంలోకి వెళ్లిపోనుంది. దీంతో ఆప్రాంతంలో మరింత కట్టుదిట్టమైన నిఘా ఉండనుంది.

Updated Date - May 28 , 2026 | 12:41 AM