Share News

‘లార్వాల వేటపై పర్యవేక్షణ అవసరం’

ABN , Publish Date - Oct 30 , 2026 | 12:29 AM

లార్వాలవేట కార్యక్రమంపై నిరంతర పర్యవేక్షణ అవసరమని జిల్లా పబ్లిక్‌ హెల్త్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ రమణకుమార్‌ అన్నారు.

 ‘లార్వాల వేటపై పర్యవేక్షణ అవసరం’
కలుషిత నీటిని పారబోస్తున్న డా.రమణకుమార్‌

పార్వతీపురం/కొమరాడ, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): లార్వాలవేట కార్యక్రమంపై నిరంతర పర్యవేక్షణ అవసరమని జిల్లా పబ్లిక్‌ హెల్త్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ రమణకుమార్‌ అన్నారు. గురువారం కొమరాడ మండలం కుంతేసి ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాన్ని ఆయన పరిశీలించారు. గ్రామంలో నీటి నిల్వలను తనిఖీ చేసి కలుషిత నీటిని స్వయంగా పారబోశారు. గర్భిణులు పౌష్టికాహారం తీసుకుంటూ రక్తహీనత నివారణకు జాగ్రత్తలు పాటించాలన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, దోమతెరలు వినియోగంపై అవగాహన కల్పించారు.

Updated Date - Oct 30 , 2026 | 12:29 AM